/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
Donald Trump
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పాలనలో తీసుకున్న పలు నిర్ణయాల పై ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) కీలక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే గత ప్రభుత్వం చివరి రోజుల్లో తీసుకున్న క్షమాభిక్షల నిర్ణయాలు చెల్లవని బాంబు పేల్చిన ఆయన..తాజాగా బైడెన్ సంతానానికి సీక్రెట్ సర్వీస్ రక్షణను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
Also Read: Chittoor: 30 సంవత్సరాల నుంచి పాములు కాటేస్తూనే ఉన్నాయి!
బైడెన్ కుమారుడు హంటర్ భద్రత నిమిత్తం సీక్రెట్ సర్వీస్ కు చెందిన 18 మంది ఏజెంట్లు పని చేస్తున్నారని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక కూతురు ఆష్లే బైడెన్ కు 13 మంది ఏజెంట్లతో కూడిన భద్రత ఉందన్నారు. ఈ రక్షణ ను వెంటనే తొలగిస్తున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Also Read: Ap Crime: నిన్న కాకినాడ..నేడు కోనసీమలో దారుణం..కాలయములవుతున్న కన్నతండ్రులు!
Secret Service Protection For Bidens Adult Children
దీని పై మాజీ అధ్యక్షుడి కార్యాలయం ఇంకా స్పందించలేదు. సాధారణంగా అమెరికాలో ఫెడరల్ చట్టాల ప్రకారం.. అమెరికా (America) లో మాజీ అధ్యక్షుడు , వారి జీవిత భాగస్వాములకు జీవితకాలం సీక్రెట్ సర్వీస్ రక్షణ ఉంటుంది. అయితే వారి సంతానానికి 16 సంవత్సరాలు దాటితే మాత్రం అధ్యక్ష కార్యాలయాన్ని వీడిన వెంటనే భద్రతను తొలగిస్తారు. కానీ , పదవి నుంచి దిగిపోయే ముందు బైడెన్ తన సంతానానికి కల్పించే రక్షణను జులై వరకు పొడిగించుకుంటూ ఉత్తర్వుల పై సంతకం చేశారు.
అంతకుముందు ట్రంప్ తొలిసారి హయాంలోనూ తన పిల్లల కోసం ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. కానీ ఇప్పుడు బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు తాజాగా ప్రకటించడం గమనార్హం. బైడెన్ క్షమాభిక్షల పై ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. క్షమాభిక్ష పత్రాల పై బైడెన్ పేరిట..ఆటోపెన్ తో సంతకాలు జరిగాయని..అందుకే వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
బైడెన్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి కొన్ని గంటల ముందు పలువురికి క్షమాభిక్షలు ప్రసాదించారు. డిసెంబర్ 12న ఒకేరోజు 1500 మంది ఖైదీల శిక్షలను తగ్గించారు. మరో 39 మంది ఖైదీలను క్షమించారు. అమెరికా ఆధునిక చరిత్రలో ఈ స్థాయిలో క్షమాభిక్షు ఎవరూ ప్రసాదించలేదు.
Also Read: Telangana: మందుబాబులకు అదిరిపోయే వార్త... మార్కెట్లోకి ఏకంగా 37 కొత్త బ్రాండ్లు..!
Also Read: TTD: తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్..ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!