/rtv/media/media_files/2025/01/22/0sMcdkMCves8ECVNdDGG.jpg)
Trump administration Photograph: (Trump administration)
America: అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ బై అవుట్ ను ప్రకటించింది.ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ నుంచి ఒక మెమో వెలువడింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన, అనుకూలతలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించారు.
Also Read: వీడు అన్న కాదు నరరూప రాక్షసుడు.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లిని చంపి.. ఏపీలో దారుణం!
ఈ మేరకు ఒక ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు.ఫిబ్రవరి 6 వ తేదీలోపు ఓ నిర్ణయానికి రావాలని దానిలో వెల్లడించారు. ఉద్యోగాలు మానేద్దామని అనుకొని ఆగిపోయినవారు దీనిని ఎంచుకోవచ్చు.
Also Read: Mahakumbh Mela Stampede: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!
కొవిడ్ తరువాత చాలా మంది ఉద్యోగులు రిమోట్ విధానంలో పని చేస్తున్నారు.తాజాగా వారు వారానికి ఐదు రోజులు ఆఫీసులకు రావాలని ట్రంప్ సర్కార్ తేల్చిచెప్పింది.ఈ కార్యాలయాల్లో విధులకు హాజరుకావడం ఇష్టం లేని ఉద్యోగులు దీనిని ఎంచుకోవచ్చని చెబుతున్నారు.
సుమారు 10-15 శాతం మంది దీనిని ఎంచుకోవచ్చని చెబుతున్నారు. సుమారు 10-15 శాతం మంది దీనిని ఎంచుకోవచ్చని భావిస్తున్నారు.ఇది విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్ డాలర్ల వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు.
ఓ వైపు ఫెడరల్ నిధులు, రుణాలను నిలిపివేసిన వేళ ఈ వార్త బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. చాలా స్థానిక సంస్థల ప్రభుత్వాలు,నాన్ ప్రాఫిట్ సంస్థ లపై దీని ప్రభావం ఉండనుంది. గతేడాది చివరికి అమెరికాలో దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
దేశం మొత్తం ఉద్యోగుల్లో ఇది 1.9 శాతానికి సమానం. ప్యూ రీసెర్చి సెంటర్ లెక్కల ప్రకారం ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి సగటున 12 ఏళ్ల పాటు పని చేస్తాడు. తాజాగా ట్రంప్ ఆఫర్ ను కొద్ది శాతం మంది ఆమోదించినా..అది ప్రభుత్వ పాలన, ఆర్థిక వ్యవస్థ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
అనుభవం ఉన్న ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, నీటి పరీక్షల విభాగం,వైమానికి రంగం,నిత్యావసర వస్తువుల రక్షణకు సంబంధించిన ఉద్యోగుల సంఖ్య తగ్గవచ్చని భావిస్తున్నారు.మరో వైపు అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు ఎవరెట్ కెల్లీ మాట్లాడుతూ దీనిని వాలంటరీ బై అవుట్ గానే చూడాలన్నారు.
Also Read:Hyderabad Metro: హైదరాబాద్ లో ఆగిపోయిన మెట్రో రైళ్లు.. ఎంతమంది చిక్కుకుపోయారంటే?
Also Read:Maha Kumbh Mela: భారీగా ట్రాఫిక్ జామ్.. 50 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు