Trump: పాకిస్థాన్‌కు వెళ్లనున్న ట్రంప్ ?.. యుద్ధం ముగించే దిశగా ప్లాన్

రెండోసారి చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగా రెండో విడుత చర్చలకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

New Update
Trump May Travel To Pakistan For Deal With Iran

Trump May Travel To Pakistan For Deal With Iran

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల విషయంలో గందరగోళం నెలకొంది. రెండోసారి చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా నిర్వహించే రెండో విడత చర్చలకు ట్రంప్ హాజరయ్యే ఛాన్స్ ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  

ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య తొలి విడుత చర్చలు జరగగా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అందుకే రెండో దశ చర్చల కోసం అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ దీనికి ఇరాన్ మాత్రం ఒప్పుకోవడం లేదు. అమెరికా పెడుతున్న డిమాండ్లకు తాము అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. అందుకే ఈసారి నిర్వహించే శాంతి చర్చలకు ట్రంప్‌ నేరుగా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. లేదా వర్చువల్‌గా అయినా పాల్గొనే ఛాన్స్ ఉంది. అందుకే ఇరాన్‌తో రాయబారం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఇరాన్‌కు చైనా భారీ షాక్ ..  హార్మూజ్ మీ సొత్తు కాదు.. వెంటనే తెరవండి!

రెండో విడుత చర్చలకు ముందుగా ఒప్పుకొని ఇరాన్.. ప్రస్తుతం దీనిపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ట్రంప్ నేరుగా ఇస్లామాబాద్‌కు వస్తే.. చర్చలు ఆశాజనకంగా ముగిసే ఛాన్స్ ఉంటుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. చర్చల విషయంలో చూసుకుంటే ఇరాన్-అమెరికా మధ్య రాజీ కుదరడం లేదు. ఇరాన్ అణ్వాయుధాలు తయారుచేయకూడదని.. హర్మూజ్‌ దిగ్బంధనం తొలగించాలని పట్టుబడుతున్నారు. కానీ ఇరాన్ దీనికి ఒప్పుకోవడం లేదు.

 అమెరికా తమకు యుద్ధం పరిహారం చెల్లించాలని ఇరాన్ కోరుతోంది. తమపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసి, విదేశాల్లో ఫ్రీజ్‌ అయిన ఇరాన్ డబ్బును చెల్లించాలని కోరుతుంది. కానీ ఈ డిమాండ్లకు అమెరికా ఒప్పుకోవడం లేదు. అందుకే ఈ రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరి రెండోసారి జరగనున్న చర్చలు సక్సె్స్ అవుతాయా ? లేదా ? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 

Also Read: పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్.. రూ.12,500 కోట్ల డీల్ క్యాన్సిల్

Advertisment
తాజా కథనాలు