BREAKING: యూటర్న్ తీసుకున్న ట్రంప్.. ఇరాన్‌తో యుద్ధానికి గుడ్ బై?

ఇరాన్‌పై చేపట్టిన దాడులకు ఇకపై గుడ్ బై చెప్పనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌తో చర్చలు దాదాపు సఫలీకృతమయ్యాయని, ఆ దేశ అగ్రనాయకత్వం తమ ప్రతిపాదనలకు అంగీకరించిందని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

New Update
Donald Trump

Donald Trump

ఇరాన్‌పై చేపట్టిన దాడులకు ఇకపై గుడ్ బై చెప్పనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్ చమురు, సహజవాయువు పరిశ్రమలను తమ నియంత్రణలోకి తీసుకుంటానని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, ఖేష్మ్ ద్వీపాలలో అమెరికా దళాలు భీకర దాడులకు దిగాయి. ఇరాన్ రాడార్ వ్యవస్థలను, గగనతల రక్షణ వ్యవస్థలను అమెరికా ధ్వంసం చేసింది. ఈ దాడుల సమయంలో రహస్యంగా 22 నౌకల ద్వారా చమురును సురక్షితంగా తరలించామని కూడా ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు. ఈ దాడులు చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకున్నారు.

ఇరాన్‌తో చర్చలు దాదాపు సఫలీకృతమయ్యాయని, ఆ దేశ అగ్రనాయకత్వం తమ ప్రతిపాదనలకు అంగీకరించిందని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, తుర్కియే, పాకిస్థాన్, బహ్రెయిన్, ఈజిప్టు వంటి దేశాలు కూడా మద్దతు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే సంతకాలు ఉంటాయని, ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. అయితే, ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే వరకు ఇరాన్ ఓడరేవులపై తమ ఆంక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

ట్రంప్ ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ఇరాన్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. అమెరికాతో తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా తమ సహనాన్ని పరీక్షిస్తోందని, వారి దాడులకు, బెదిరింపులకు తమ సైన్యం తగిన సమాధానం ఇస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. ఈ ప్రాంతంలో సురక్షితంగా ఉండాలంటే అమెరికా బలగాలు వెంటనే వెనక్కి వెళ్లాలని ఆయన సూచించారు. ఇరాన్ ఇప్పటికే కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేశామని ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు