/rtv/media/media_files/2025/03/23/e1qiQos5QrsKCsaEV2ji.jpg)
USA Gold Card
గోల్డ్ కార్డ్ స్కీమ్ కు మస్త్ గిరాకీ ఏర్పడింది. ఒక్కరోజులోనే 1000 గోల్డ్ కార్డులను విక్రయించామని ఈ మేరకు యూఎస్ కామర్స్ మినిస్టర్ హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. ప్రపంచ దేశాల సంపన్నులు అమెరికా గోల్డ్ కార్డ్ కోసం ఎగబడుతున్నారు. వీరందరూ అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉండడమే కాకుండా ఇక్కడ సెటిల్ అయ్యేందుకు గోల్డ్ కార్డ్ ను పోటీ పడి మరీ కొంటున్నారు. అమెరికాలో ప్రసారమయ్యే ఆల్-ఇన్ పాడ్ కాస్ట్ లో కామర్స్ మినిస్టర్ హోవార్డ్ లుట్నిక్ ఈ విషయాన్ని తెలిపారు. ఒక్కో కార్డుకు 50 లక్షల డాలర్ల (రూ. 43 కోట్లు) చొప్పున మొత్తం 500 కోట్ల డాలర్ల(రూ. 43 వేల కోట్లు) ఆదాయం సమకూరిందని చెప్పారు. గోల్డ్ కార్డుల ద్వారా వచ్చిన డబ్బులతో అమెరికాకు ఉన్న అప్పులను కొంతమేర వరకు తగ్గించాలనే యోచనలో ఉన్నామని లుట్నిక్ తెలిపారు. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ అప్పులు ప్రస్తుతం 36 లక్షల కోట్ల డాలర్లు ఉన్నాయి.
5 మిలియన్లకు గోల్డ్ కార్డ్..
ఈ గోల్డ్ కార్డుల ద్వారా అమెరికాకు ఫైనాన్స్ ఉన్న లోటును పూరిస్తామని ట్రంప్ ఇంతకు ముందే చెప్పారు. సమారు ఒక మిలియన్ గోల్డ్ కార్డులు ఇస్తామని తెలిపారు. దీంతో వచ్చిన మొత్తంతో అమెరికాలో ఉద్యోగాలు సృష్టించవచ్చని వివరించారు. విదేశీ పెట్టుబడిదారులను శాశ్వత నివాసితులుగా మార్చడానికి అనుమతించే "EB-5" వలస పెట్టుబడిదారు వీసా కార్యక్రమాన్ని "గోల్డ్ కార్డ్"తో భర్తీ చేస్తామని ట్రంప్ చెప్పారు. దీని ద్వారా ధనవంతులు తమ దేశంలోకి వస్తారని అన్నారు. అమెరికాలో వ్యాపారం చేయాలన్నా, పెట్టుబడి పెట్టాలన్నా లేదా తొందరగా గ్రీన్ కార్డ్ రావాలంటే ఈబీ 5 వీసా ఉండాలి. దీని ద్వారా గ్రీన్ కార్డ్ చాలా తొందరగా వచ్చేస్తుంది. అంతేకాదు అమెరికా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఇది రష్యన్లతో సహా అన్ని దేశాల వారికీ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. EB-5 ప్రోగ్రామ్ వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నామన్నారు ట్రంప్. చట్టబద్ధంగా రావాలనుకున్న ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.
today-latest-news-in-telugu | usa | trump | green-card citizenship
Also Read: India: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్