/rtv/media/media_files/2026/01/01/trump-2026-01-01-13-12-36.jpg)
Trump
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు సొంత దేశంలోనే ఎదురుగాలి వీస్తోంది. అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే ఆయన ప్రజాదరణ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఆర్థిక విధానాలు, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలు, కఠినమైన వలస విధానాలే ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా ట్రంప్ నాలుగేళ్ల పాలన మిగిలే ఉంది. అప్పుడే దేశంలో ట్రంప్‌కు వ్యతిరేకత పెరుగుతోంది. ఇరాన్‌తో యుద్ధం విషయంలో ట్రంప్‌కు చెడ్డపేరు వచ్చింది. ఆయన సొంత పార్టీ నేతలు, దేశ ప్రజలు యుద్ధం వద్దని ఆంధోళనలు చేస్తున్నారు. అయినా సరే ట్రంప్ మొండి పోకడ పోతున్నాడు. ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్‌కు కూడా ఇరాన్‌పై దాడులకు దిగడం ఇష్టం లేదని తెలుస్తోంది. ట్రంప్ ఇష్టానికి తీసుకుంటున్న నిర్ణయాలు ఈయన క్రేజ్‌ను తగ్గిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సాగుతున్న "నో కింగ్స్" నిరసనలు, 2026 మిడ్-టర్మ్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రజామోదం రేటింగ్‌లో భారీ పతనం
మొదటి గ్రాఫ్ ప్రకారం, ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి కంటే ప్రస్తుతం ఆయన అప్రూవల్ రేటింగ్ 37% కి పడిపోయింది. 2024 ఎన్నికల సమయంలో ఉన్న జోష్ ఇప్పుడు కనిపించడం లేదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణంతో అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ వంటి ప్రపంచ నాయకులతో పోలిస్తే, ట్రంప్ ప్రజాదరణ సగం కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
2. టారిఫ్ విధానం - ఆర్థిక గందరగోళం
రెండవ కీలక అంశం ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలు. ఇతర దేశాలపై భారీగా పన్నులు విధించడంతో అమెరికాను సంపన్న దేశంగా మారుస్తామని ఆయన ప్రకటించినప్పటికీ, గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికాలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా కాదని ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా సుంకాలను పెంచడంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది.
3. మిత్రదేశాల దూరం
మూడవ గ్రాఫ్ అంతర్జాతీయ మద్దతు, భద్రతపై ప్రజల అభిప్రాయాన్ని చూపుతోంది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరగడం, హర్మూజ్ జలసంధి వివాదంలో జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి మిత్రదేశాలు అమెరికాకు సహకరించడానికి నిరాకరించడం వంటివి ట్రంప్ వైఫల్యాలుగా నెటిజన్లు భావిస్తున్నారు. "అమెరికా ఫస్ట్" నినాదం క్రమంగా "అమెరికా ఐసోలేషన్" (ఒంటరి అమెరికా) గా మారుతోందని నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Follow Us