Donald Trump : ఇరాన్ సైన్యం 100% ఖతం.. త్వరలోనే హోర్ముజ్ ఓపెన్ చేస్తాం : ట్రంప్ !

ఇరాన్‌తో జరుగుతున్న భీకర పోరాటంలో అమెరికా కీలక విజయాన్ని సాధించిందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శనివారం జరిగిన రక్షణ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ

New Update
Donald Trump

ఇరాన్‌తో జరుగుతున్న భీకర పోరాటంలో అమెరికా కీలక విజయాన్ని సాధించిందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శనివారం జరిగిన రక్షణ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ మిలటరీ సామర్థ్యాలను అమెరికా దళాలు 100 శాతం నాశనం చేశాయని స్పష్టం చేశారు. "ఇప్పుడు ఇరాన్ ఒక తల తెగిపడిన దేశంలా మారిపోయింది.. అటువంటి దేశం నుంచి ఇకపై ప్రపంచానికి ఎలాంటి ముప్పు ఉండదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

చేతులు కలపండి 

ప్రస్తుతం ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా దాడులు కొనసాగుతున్నాయని, అతి త్వరలోనే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని అమెరికా తిరిగి ఓపెన్ చేస్తుందని ట్రంప్ హామీ ఇచ్చారు. హోర్ముజ్ మార్గాన్ని మరింత సురక్షితంగా, స్వేచ్ఛాయుతంగా మారుస్తామని ఆయన ప్రకటించారు. అయితే, ప్రపంచ వాణిజ్య భద్రత దృష్ట్యా ఈ ఆపరేషన్‌లో తమతో చేతులు కలపాలని చైనా, ఫ్రాన్స్, జపాన్, సౌత్ కొరియా, యూకే వంటి దేశాలను ట్రంప్ కోరారు. తమ వాణిజ్య నౌకల రక్షణ కోసం ఆయా దేశాలు వెంటనే యుద్ధనౌకలను పంపాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో మధ్యప్రాచ్యంలో యుద్ధం ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ నావికా దళం, వాయు సేన స్థావరాలను అమెరికా పూర్తిగా ధ్వంసం చేయడంతో, హోర్ముజ్ మార్గం ద్వారా చమురు సరఫరా పునరుద్ధరించబడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఇప్పటికే తన భారీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, మెరైన్ సైనికులను ఆ ప్రాంతంలో మోహరించి తన పట్టును నిరూపించుకుంది.

Advertisment
తాజా కథనాలు