US Vs Iran: ఈ రాత్రికి ఏం జరగబోతోంది ? ఇరాన్ VS అమెరికా..

హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌పై విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది.  దీంతో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చలకు ద్వారాలను మూసేసింది.

New Update
Trump Deadline Looms, Iran Cuts, Then Reopens Communication With US, Report

Trump Deadline Looms, Iran Cuts, Then Reopens Communication With US, Report

హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌పై విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది.  దీంతో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చలకు ద్వారాలను మూసేసింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా టెహ్రాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. అమెరికాతో ఉన్న దౌత్య, పరోక్ష సంభాషణ మార్గాలను ఇరాన్ మూసివేసినట్లు తెలిపింది. ఇరుదేశాల మధ్య సందేశాల మార్పిడిని కూడా ఆపివేసినట్లు తెలిపింది.  

Also Read: ఇరాన్‌ సంచలన ప్రకటన.. ప్రజలు యుద్ధంలో పాల్గొనాలని పిలుపు

ఇదిలాఉండగా ట్రంప్ ఇరాన్‌పై విధించిన గడువు అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలకు ముగియనుంది. భారత కాలమాన ప్రకారం  తెల్లవారుజామున 5.30 గంటలకు ఈ గడువు ముగియనుంది. ఈ సమయం లోపు హర్మూజ్‌ జలసంధిని తెరవకుంటే ఇరాన్‌లో ఉన్న వంతెనలను, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఇరాన్ నాగరికత ఈరోజు రాత్రితో అంతమైపోతుందని హెచ్చరికలు కూడా చేశారు.   

Also Read: రాబోయే 48 గంటలు ఇళ్లల్లోనే ఉండండి..ఇరాన్‌లోని ఇండియన్స్‌కు కేంద్రం హెచ్చరిక

ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం బెదరడం లేదు. అమెరికా, దాని మిత్రదేశాలు తమ దెబ్బ రుచి చూస్తాయంటూ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈజిప్టు, పాకిస్థాన్, తర్కియే దేశాల మధ్యవర్తిత్వంతో జరుగుతున్న చర్చలను ఆపేసింది. అయితే శాంతి చర్చల్లో 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తీసుకొచ్చారు. కానీ ఇరాన్ దీన్ని తిరస్కరించింది. అయితే మరికొన్ని గంటల్లో ఇరాన్‌పై విధించిన గడువు ముగియనుండటంతో అమెరికా ఎలాంటి దాడులు చేస్తుందో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.  

Advertisment
తాజా కథనాలు