/rtv/media/media_files/2026/05/05/trump-congratulates-pm-modi-2026-05-05-21-35-21.jpg)
Trump Congratulates PM Modi
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. ఈ విజయాన్ని ఆయన "చారిత్రాత్మక, నిర్ణయాత్మకమైనది"గా అభివర్ణించారు. బెంగాల్‌లో మొదటిసారి బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడంతో వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ కూడా స్పందించారు. మోదీ నాయకత్వంలో విజయం సాధించిన ఈ గెలుపు ఇరు దేశాల మధ్య సంబంధాలకు మరింత బలాన్నిస్తుందని తెలిపారు.
294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ఏకంగా 207 స్థానాల్లో గెలవగా.. టీఎంసీ 80 సీట్లకే పరిమితమయ్యింది. ఈ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి పోటీ చేసిన సీఎం మమతా బెనర్జీ కూడా ఓడిపోయారు. బీజేపీ నేత సువేందు అధికారి ఆమెపై 15 వేల ఓట్ల తేడాతో గెలిచారు. మరోవైపు మే 9న బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య తెలిపారు.
Follow Us