/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
Donald Trump
America-Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.ఇప్పటికే ఇతర దేశాల పై టారిఫ్ లు, ఆంక్షలతో విరుచుకుపడుతున్న ఆయన స్వదేశంలోనూ కొన్ని సంస్థల్లో సమూల ప్రక్షాళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచంలో అతిపెద్ద సహాయ సంస్థ అయిన అమెరికా అంతర్జాతీయ అభివృద్ది సంస్థ లో ఏకంగా 9,700 మందికి పైగా ఉద్యోగాలు తొలగించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది.
ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. ఈ సంఖ్యను 300 దిగువకు తీసుకురావాలని చూస్తున్నారు. కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పని చేసేలా ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీరిలో 12 మంది ఆఫ్రికా బ్యూరో,ఎనిమిది మంది ఆసియా బ్యూరోలో ఉండనున్నారంట.
9700 మందికి త్వరలోనే....
మిగతా 9700 మందికి త్వరలోనే ఉద్వాసన పలకనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. మరో వైపు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పైనా ట్రంప్ ఆంక్షలు విధించారు. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై తాజాగా ఆయన సంతకం చేశారు. అమెరికా దాని మిత్రదేశం ఇజ్రాయెల్ లక్ష్యంగా నిరాధార దర్యాప్తులు చేపడుతోందని ఈ సందర్భంగా అధ్యక్షుడు దుయ్యబట్టారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పై అరెస్ట్ వారెంట్ జారీ చేసి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తన అధికారాలను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు.