/rtv/media/media_files/2025/03/20/3POGAgjTkDgoHNn0y2vl.jpg)
John F Kennedy
1963లో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్.ఎఫ్ కెనడీ హత్యకు గురైన సంగతి తెలసిందే. ఈ హత్య కేసులో సీఐఏ పాత్ర ఏమైనా ఉందా ? అమెరికా నిఘా సంస్థలోనే ఎవరైనా కుట్ర పన్నారా ? అనేది గత కొన్నేళ్లుగా మిస్టరీగానే ఉండిపోయింది. అయితే తాజాగా ట్రంప్ సర్కార్ విడుదల చేసిన రహస్య పత్రాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో జాన్.ఎఫ్ కెనడీకి హత్యకు సంబంధించి సీఐఏ పాత్రకు సంబంధించిన ప్రస్తావనలు కూడా ఉన్నాయి.
Also Read: మణిపూర్‌లో మళ్లీ ఘర్షణ.. ఈసారి హమర్, జోమి తెగల మధ్య గొడవలు
మొత్తం 63 వేల పేజీలతో కూడా 2,200 దస్త్రాలను యూఎస్ నేషనల్ ఆర్కీవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అయితే కెనడీ హత్య వెనుక సీఐఏ హస్తం ఉండొచ్చని మొదటి నుంచే అనుమానాలు ఉన్నాయి. ట్రంప్ సర్కార్ విడుదల చేసిన రహస్య పత్రాల్లో హత్యకు సంబంధించి సీఐఏ పాత్రను నేరుగా ప్రస్తావించనప్పటికీ ముందస్తు హెచ్చరికలను సీఐఏ నిర్లక్ష్యం వహించినట్లు తెలిపింది.
Also Read: బెట్టింగ్ యాప్స్ కేసు.. అడ్డంగా దొరికిపోయిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్!
1961లో అమెరికా 35వ అధ్యక్షుడిగా జాన్ ఎఫ్ కెనడీ బాధ్యతలు చేపట్టారు. 1963 నవంబర్ 22న డాలస్‌లో ఆయన హత్యకు గురయ్యారు. తన కాన్వాయ్‌లో ప్రయాణిస్తుండగా దుండగుడు వెనుక నుంచి కాల్పులు జరిపాడు.కాల్పులు జరిపిన దుండుగుడి పోలీసులు అరెస్టు చేశారు. అతడిని లీ హర్వే ఓస్వాల్ట్‌గా గుర్తించారు. అయితే కేసు దర్యాప్తు చేస్తుండగా అతడు కూడా హత్యకు గురయ్యాడు. లీ హర్వేను చంపిన వ్యక్తిని అరెస్టు చేసి జైలు శిక్ష విధించారు. కానీ కొంతకాలం తర్వాత అతడు కూడా క్యాన్సర్‌తో మరణించాడు. దీంతో అప్పటినుంచి కెనడీ హత్య ఘటన మిస్టరీగానే ఉండిపోయింది.
Also Read: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు
Also Read: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ