/rtv/media/media_files/2025/04/07/ZiNIQ58PLtC2nsWBsRtG.jpg)
Bill gates
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ భారత యువతకు కీలక సూచనలు చేశారు. యవత ఎక్కువగా ప్రయాణాలు చేయాలన్నారు. పేదవారు ఉండే ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలని చెప్పారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రపంచంలో భారత్ టాలెంట్ హబ్‌గా ఎందుకు మారుతుందనే దానిపై వచ్చిన ప్రశ్నకు బిల్ గేట్స్ బదులిచ్చారు.
'' భారతీయులు గొప్ప ప్రతిభావంతులు. సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు. వాళ్ల ఆవిష్కరణలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. డిజిటల్ రంగంలో కూడా భారత్ దూసుకెళ్తోంది. ఆధార్ లాంటి సంబంధిత కార్యక్రమాలు దీనికి నిదర్శనం. అలాగే భారత్‌లో యువకులు ఎక్కువగా ప్రయాణాలు చేయాలి. పేదలు నివసించే ప్రాంతాలకు వెళ్లి పరిశీలించండి.
Also Read: ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్స్ యువతికి మత్తుమందు ఇచ్చి.. 23 మంది గ్యాంగ్‌రేప్
అక్కడుండే వారు ఎంతో తెలివైన వాళ్లు. కానీ వాళ్లకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. మంచి విద్య అందడం లేదు. వాళ్లకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీటిని భారత యువత గమనించాలని'' బిల్ గేట్స్ అన్నారు. అలాగే ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన తన ఆస్తికి సంబంధించిన విషయాలను కూడా పంచుకున్నారు. తన పిల్లలకు తాను కూడబెట్టిన ఆస్తిపై ఆధారపడకుండా వాళ్లు సొంతంగా సంపాదించుకోగలరనే నమ్మకం కలిగించారు. తాను సంపాదించిన మొత్తంలో 1 శాతం కంటే తక్కవ పిల్లలకు ఇస్తానని చెప్పారు.
Also Read: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారీగా పతనమైన భారత స్టాక్ మార్కెట్
rtv-news | bill-gates | india