BREAKING: కాలిఫోర్నియాలో విషాదం.. కూలిన విమానం.. 8 మంది వాయుసేన సిబ్బంది దుర్మరణం!

దక్షిణ కాలిఫోర్నియాలో అమెరికా వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన బీ-52 బాంబర్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ విషాదకర ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అమెరికా వాయుసేన సిబ్బంది దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు.

New Update
FotoJet (3)

దక్షిణ కాలిఫోర్నియాలో అమెరికా వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన బీ-52 బాంబర్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ విషాదకర ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అమెరికా వాయుసేన సిబ్బంది దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరం నుంచి ఈ భారీ బాంబర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాల వల్ల గాలిలోనే నియంత్రణ కోల్పోయి నేలకూలింది. ప్రమాద తీవ్రతకు విమానం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, రక్షణ సిబ్బంది, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు, సిబ్బందిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Advertisment
తాజా కథనాలు