/rtv/media/media_files/2025/03/27/0qWMHWtDaNyKDSq1qEsN.jpg)
Tourist submarine sinks off Egypt’s coast
ఈజిప్టు తీర నగరమైన హుర్‌ఘడలోని ఎర్ర సముద్రంలో విషాదం చోటుచేసుకుంది. పర్యటకుల జలాంతర్గామి (సబ్‌మెరైన్) మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీళ్లలో నలుగురి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగే సమయంలో సబ్‌మెరైన్‌లో దాదాపు 40 మంది ఉన్నట్లు సమాచారం. నౌకశ్రయానికి దగ్గర్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: రూ.10లక్షల కోట్లతో.. 25వేల కి.మీ రోడ్లు : నితిన్ గడ్కరీ
ఇక వివరాల్లోకి వెళ్తే.. హుర్‌ఘడ సిటీ అనేది పర్యాట రంగానికి ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో ఉండే బీచ్‌లు, పగడపు దిబ్బలు పర్యటకులను ఆకర్షిస్తుంటాయి. అలాగే ఇక్కడ టూరిస్టు సబ్‌మెరైన్‌లు సేవలందిస్తుంటాయి. ఇందులో సింద్‌బాద్ అనే టూరిస్టు సబ్‌మెరైన్ కూడా ఉంది. అయితే సముద్రంలో 25 మీటర్ల లోతు వరకు మాత్రమే పర్యటకులకు పర్మిషన్ ఉంటుంది. తాజాగా జరిగిన ప్రమాదంపై సదరు సంస్థ స్పందించింది. ప్రపంచంలో ఇలాంటి సబ్‌మెరైన్‌లు 14 మాత్రమే ఉన్నాయని తెలిపింది. అందులో రెండింటికి తామే సర్వీసులు అందిస్తున్నట్లు పేర్కొంది.
Also Read: పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి!
ఇదిలాఉండగా.. హుర్‌ఘడలో గత కొంతకాలంగా టూరిస్టు పడవల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత నవంబర్‌లో కూడా ఓ టూరిస్టు బోటు మునిగిపోవడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. 35 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. గడిచిన ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు 16 జరిగినట్లు సమచారం.
Also Read: ఒకరితో శృంగారం.. మరొకరితో సంసారం: యువకుడి పెళ్లి పెటాకులు చేసిన కాన్ఫరెన్స్ కాల్!
Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్ కామెడీ అంటూ!
rtv-news | red-sea | egypt