/rtv/media/media_files/2025/03/12/NaqcosDncJRgVDR3yXV9.jpg)
trudeau
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ..బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.తరువాత ప్రధానిగా మార్క్ కార్నీని లిబరల్ పార్టీ ఇప్పటికే ఎన్నుకుంది. ఈ క్రమంలో ట్రూడోకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో..ఓ కుర్చీ చేత పట్టుకొని, నాలుక బయటపెట్టి పోజిచ్చిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: KCR: ఆ అంశాలపై పోరాడుదాం.. ప్రభుత్వం మెడలు వంచుదాం.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ కీలక సూచనలు!
మార్చి 9న జరిగిన ఎన్నికల్లో మార్క్,కార్నీని లిబరల్ పార్టీ తమ సారథిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన కెనడా తదుపరి ప్రధానిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా అధికార మార్పిడిలో భాగంగా కార్నీతో జస్టిన్ ట్రూడో భేటీ అయినట్లు సమాచారం. ఈ ప్రక్రియ సవ్యంగా,అతి త్వరలో పూర్తి కానున్నట్లు విలేకర్లకు వెల్లడించిన ఆయన..ప్రభుత్వం నుంచి పూర్తిగా వైదొలిగే ప్రక్రియను ప్రారంభించారు.
తన కుర్చీని కూడా...
ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవనం నుంచి బయటకు వస్తూ తన కుర్చీని కూడా వెంట తీసుకుని వచ్చారు. ఈ సన్నివేశాన్ని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ క్లిక్ మనిపించగా...కొద్ది గంటల్లోనే అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని పై యూజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సాధారణ జీవితాన్ని గడిపేందుకు ట్రూడో సిద్ధమయ్యారని కొందరు పేర్కొంటుండగా...ఏంటీ ఈ సర్కస్? ట్రూడో చాలా ఫన్నీగా ప్రవర్తిస్తున్నారంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే కెనడాలో పార్లమెంటు నుంచి వెళ్లిపోయే సమయంలో చట్టసభ సభ్యులు వాళ్ల కుర్చీలను వెంట తీసుకుని వెళ్లే వెసులుబాటు ఉందని సమాచారం.
Also Read: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు