/rtv/media/media_files/2026/05/05/fotojet-2026-05-05-13-35-01.jpg)
Iran drone attack UAE
Iran Drone Attack UAE : పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యూఏఈ (UAE) లోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్‌పై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడి(iran attack on dubai) అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా ప్రాంతంలో ఉన్న చమురు శుద్ధి కేంద్రం ,ఇండస్ట్రియల్ జోన్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ దాడి కారణంగా అక్కడ భారీగా మంటలు చెలరేగగా, చమురు శుద్ధి కేంద్రం పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారికి ప్రాణాపాయం లేదని అధికారులు వెల్లడించారు.
భారతీయులు గాయపడిన ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది. మౌలిక సదుపాయాలు,అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు(iran-attack) చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఖండించింది. ఇలాంటి దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూనే, చర్చలు , దౌత్య మార్గాల ద్వారా శాంతిని పునరుద్ధరించడానికి భారత్ మద్దతు ఇస్తుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జయస్‌వాల్ తెలిపారు.
Also Read : వైట్ హౌజ్ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం.. స్పాట్ లొ డొనాల్డ్ ట్రంప్
Three Indians Injured In Iranian Drone Attack
ఈ దాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పౌరులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ, ప్రపంచ ఇంధన భద్రతకు హర్మూజ్ జలసంధి అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఈ జలసంధి గుండా వాణిజ్య నౌకల ప్రయాణం స్వేచ్ఛగా, నిరాటంకంగా జరగాలని భారత్ ఆకాంక్షిస్తోంది. అన్నారు.
హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు ప్రారంభించిన 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ఈ తాజా ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. సోమవారం రెండు వాణిజ్య నౌకలు సురక్షితంగా జలసంధి దాటాయని అమెరికా ప్రకటించగా, తమ అనుమతి లేకుండా వచ్చిన అమెరికా నౌకపై క్షిపణి దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. అయితే తమ నౌకలపై ఎలాంటి దాడులు జరగలేదని అమెరికా ఈ ప్రకటనను ఖండించింది.
కాగా, ఈ దాడులపై ఇరాన్ స్పందించింది. తమ దాడులు ఉద్దేశపూర్వకమైనవి కావని ఇరాన్ మీడియా పేర్కొంది. అమెరికా చేస్తున్న సైనిక సాహసకృత్యాల వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఇరాన్(iran us war) ఆరోపించింది. మరోవైపు, యూకే, ఫ్రాన్స్, జర్మనీ , సౌదీ అరేబియా వంటి దేశాలు ఇరాన్‌ను హెచ్చరించాయి. హర్మూజ్ జలసంధిని లేదా ప్రపంచ దేశాలను బందీలుగా చేయవద్దని, అమెరికాతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అవి సూచించాయి.ఈ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. కేంద్ర ప్రభుత్వం పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది.
Also Read : షాకింగ్ ఘటన.. నెదర్లాండ్ యువరాణులపై హత్యాయత్నం.. రెండు గొడ్డళ్లు స్వాధీనం
Follow Us