US Israel Iran War : తీవ్ర ప్రాణ నష్టం మిగిల్చిన పశ్చిమాసియా యుద్ధం..ఎన్నివేలమందో తెలుసా?

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన యుద్ధం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఇప్పట్లో ముగుస్తుందన్ననమ్మకం లేదు. యుద్ధం మూలంగా కేవలం ఆర్థిక నష్టమే కాదు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఇరాన్‌లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

New Update
FotoJet (3)

US Israel Iran war

అణ్వాయుధాలు ఉన్నాయన్న అనుమానంతో  అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ ఒక కొలిక్కిరాలేదు. ఇప్పట్లో యుద్ధం ముగుస్తుందన్న సంకేతాలు కూడా లేవు. యుద్ధం ప్రారంభమై ఆరువారాలకు చేరుకున్నప్పటికీ ఏ ఒక్కదేశ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం మూలంగా కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా(iran us conflict) నే కాకుండా సమీపంలోని లెబనాన్‌,గల్ఫ్ దేశాలకు తీవ్ర నష్టం కలిగించింది. అటు ఆయా దేశాల్లోని అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం కలిగించింది. యుద్ధం మూలంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత ఏర్పడి పలు దేశాలు లాక్‌ డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. యుద్ధం మూలంగా కేవలం ఆస్తి, ఆర్థిక నష్టమే కాదు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా సంభవించింది. ముఖ్యంగా ఇరాన్‌లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ముక్కుపచ్చలారని చిన్నారులు ఎందరో ఉన్నారు. ఎన్నో వందల మంది గాయాలపాలయ్యారు.  

Also Read :  రాడార్లకు చిక్కకుండా అమెరికా ఫైటర్‌ జెట్లను ఇరాన్ ఎలా కూల్చివేసిందో తెలుసా ?

The West Asian War Left A Huge Loss Of Life

కాగా, ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిరకు ఇరాన్‌లో 3,531 మంది మరణించారని అమెరికాకు చెందిన మానవ హక్కుల సంఘం హెచ్‌ఆర్‌ఏఎన్‌ఏ పేర్కొంది. వీరిలో 1,607 మంది సామాన్య పౌరులు ఉన్నారని తెలపడం గమనార్హం. అంతేకాదు మృతుల్లో  244 మంది పిల్లలు కూడా ఉన్నారని పేర్కొనడం గుండెతరుక్కుపోయే విషం. క్షేత్రస్థాయి నివేదికలు, స్థానికుల సమచారం, వైద్య, అత్యవసర వనరులు, అధికారిక ప్రకటనల ఆధారంగా తాము ఈ  సమాచారాన్ని సేకరించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ  సమాచారం ఆధారంగా ఇరాన్‌లో 3500 మందికి పైగా చనిపోయారని పేర్కొంది. - Iran US Isarel War

ఇదిలా ఉండగా అంతర్జాతీయ సంస్థ అయిన రెడ్‌క్రాస్ వాదన మరోతీరు ఉంది. అమెరికా -ఇజ్రాయెల్ దాడుల మూలంగా ఇరాన్‌లో ఇప్పటివరకు కనీసం 1,900 మంది మరణించగా, 20,000 మంది గాయపడ్డారని పేర్కొన్నది. ఇక, మార్చి 2 నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 124 మంది చిన్నారులతో పాటు దాదాపు 1,368 మంది లెబనాన్ పౌరులు మరణించారని లెబనీస్ అధికారులు వెల్లడించారు. అలాగే, లెబనీస్ సాయుధ సంస్థ హిజ్బుల్లాకు చెందిన 400 మంది సైనికులు మరణించారని ఆ సంస్థ ప్రకటించింది. అలాగే ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాక్‌లో 108 మంది మరణించారు.

ఇరాన్, లెబనాన్  ప్రయోగించిన క్షిపణుల దాడుల మూలంగా ఇజ్రాయెల్‌లో 19 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ అంబులెన్స్ సర్వీస్ పేర్కొన్నది. దక్షిణ లెబనాన్‌కు చెందిన10 మంది సైనికులు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇక, ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన పదమూడు మంది సైనికులు మరణించారు. అమెరికా సైనిక ఇంధన సరఫరా విమానం కూలిపోయిన ప్రమాదంలో ఆరుగురు సైనికులు మరణించినట్లు అమెరికా సైన్యం తెలిపింది. మరో ఏడుగురు ఇరాన్‌ క్షిపణి దాడుల మూలంగా మరణించినట్టు పేర్కొనడం గమనార్హం.

Also Read :  చైనాను వణికిస్తున్న వింత వ్యాధి: వేల సంఖ్యలో పశువుల మృతి!

Advertisment
తాజా కథనాలు