Saudi Arabia and UAE : ఇరాన్‌ అమెరికాల మధ్య ముదురుతున్న వార్‌..యుద్ధంలోకి సౌదీ, యూఏఈ..?

ఇరాన్, అమెరికా మధ్య నెలరోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో యుద్ధంలోకి సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) చేరనున్నాయని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది.

New Update
FotoJet (6)

Trump Meets With UAE Crown Prince Ahead

 Saudi Arabia and UAE : ఇరాన్‌ పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో ఇరాన్‌సైతం ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో నెలరోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో యుద్ధంలోకి సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) చేరనున్నాయని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది.  అమెరికాకు సహాకరిస్తున్నామనే నేపంతో ఇరాన్ తమ దేశంపై ఎన్ని దాడులు చేసినా ఇన్నాళ్లు ఓపికతో ఉన్న యూఏఈ ప్రస్తుతం అమెరికాతో చేతులు కలపడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని మూసివేయడం వల్ల తమ దేశం ఇప్పటికే చాలా నష్టపోయిందని భావిస్తున్న యూఏఈ  ఇకపై మరింత నష్టం జరగకూడదనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అదే జరిగితే ఇరాన్ యుద్ధంలో నేరుగా పాల్గొన్న మొదటి పర్షియన్ గల్ఫ్ దేశంగా యూఏఈ నిలిచే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఇరాన్‌తో సాగుతున్న యుద్ధం సందర్భంగా యూఏఈ కి చెందిన వైమానిక స్థావరాలను వినియోగించుకుంటామని అమెరికా(US) సైన్యం కోరినప్పటికీ దానికి ఒప్పుకోలేదు. అయినా అక్కడ అమెరికా స్థావరాలున్నాయని అనుమానంతో ఇరాన్‌ యూఏఈపై దాడులకు దిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం వైమానిక స్థావరాల వినియోగానికి అంగీకరించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. హర్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తుండటంతో ఆ ప్రయత్నాలకు తమ దేశం మద్దతిస్తోందని యూఏఈ అధికారిక వర్గాలు పేర్కొన్నట్లు జర్నల్‌ వెల్లడించింది.

మద్దతు కోసం చర్చలు

ఇక ప్రత్యక్ష యుద్ధంలోకి దిగాలని భావిస్తున్న యూఏఈ ఇరాన్‌ పై దాడులు చేయడానికి ప్రపంచ దేశాల మద్దతు కోరుతుంది. అందులో భాగంగా ఇరాన్‌పై చర్యలకు అధికారం ఇచ్చే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు జర్నల్‌ కథనం పేర్కొనడం గమనార్హం. అవసరమైతే బలప్రయోగం చేసైనా.. హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడానికి ఒక కూటమిని ఏర్పాటుచేయాలని యూఏఈ దౌత్యవేత్తలు భావిస్తున్నారు. దీనికి మద్ధతు ఇవ్వాలని అమెరికా సహా యూరప్, ఆసియాలోని ముఖ్యమైన దేశాలను కోరుతుంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇరాన్ హర్మూజ్‌ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకొని.. ప్రపంచ ఆర్థికవ్యవస్థను పతనం చేస్తుందని అన్ని దేశాలకు వివరిస్తోంది.

ఏక మవుతున్న గల్ఫ్ దేశాలు

అమెరికాకు మద్దుతు ఇస్తున్నామనే నేపంతో తమ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్‌పై గల్ఫ్‌ దేశాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడి ప్రజలు కూడా హ
తమ దేశాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులు కొనసాగిస్తుండడంతో గల్ఫ్ దేశాల ప్రజలు ఇరాన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. టెహ్రాన్ ప్రభుత్వం బలహీనపడే వరకు లేదా అధికారం నుంచి తొలగిపోయే వరకు యుద్ధం కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఆయా దేశాలు తమ సైన్యాన్ని స్వయంగా రంగంలోకి దించనప్పటికీ.. అమెరికాకు రహస్యంగా మద్దతునిస్తున్నాయి. ఇరాన్‌పై పట్టు సాధించాలంటే దశాబ్దాలుగా ఇరాన్ నియంత్రణలో ఉండి.. యూఏఈ హక్కులు కోరుతున్న అబు మూసా వంటి వ్యూహాత్మక ద్వీపాలను ఆక్రమించుకోవాలని యూఏఈ అమెరికాకు సూచించింది. 

పెరుగుతున్న దాడులు

నిజానికి యూఏఈ యుద్ధంలోకి నేరుగా ప్రవేశించలేదు. అయితే అమెరికా సైన్యానికి షెల్టర్‌ ఇస్తున్నారనే కారణంతో ఇరాన్ ఆ దేశంపై దాడులు తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే పలు గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాదాపు 2,500 క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది. తమకు వ్యతిరేకంగా సైనిక చర్యకు మద్దతిచ్చే గల్ఫ్‌ దేశాల్లోని పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాక్‌  హెచ్చరించింది. హర్మూజ్‌ను తెరవడానికి, ఇరాన్‌ క్షిపణి సామర్థ్యాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని హెచ్చరించింది. నిరంతర దాడుల వల్ల విమాన ప్రయాణాలకు అంతరాయం కలగడంతో యూఏఈ పర్యాటకం తీవ్రంగా ప్రభావితమయ్యింది. 

ఇరానీయులకు యూఏఈలోకి నిషేధం..

ఇరాన్‌ ప్రతీకార దాడుల కారణంగా టెహ్రాన్ ప్రజలు తమ దేశంలోకి ప్రవేశించడంపై యూఏఈ నిషేధం విధించినట్లు పలు విమానయాన సంస్థలు వెల్లడించాయి. దేశంలో గోల్డెన్ వీసాలు ఉన్నవారిని ఇందులో నుంచి మినహాయించినట్లు తెలిపాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. 

హర్మూజ్‌ను తిరిగి తెరవగలరా?

ఐక్యరాజ్యసమితి మద్దతుతో హర్మూజ్‌ను తిరిగి తెరవడానికి యూరప్, ఆసియా దేశాలు చేస్తున్న ప్రయత్నాల్లో చేరడానికి యూఏఈ అధికారులు ప్రయత్నిస్తుస్తున్నారని..అది సాధ్యం కానీ పక్షంలో  అమెరికాతో కలిసి, ఇరాన్‌ పై సైనిక చర్య చేపట్టడానికి సైతం ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం సమీపంలోని భూభాగం పైనా నియంత్రణ అవసరమని యూఏఈ భావిస్తోంది. అయితే అక్కడి భూభాగంపై నియంత్రణ సాధించడం సంక్లిష్టమైన, ప్రమాదకరమైన ఆపరేషన్ అని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు