/rtv/media/media_files/2026/03/11/hormuz-2026-03-11-21-37-47.jpg)
Thailand ship hit in Strait of Hormuz was Gujarat-bound
హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భారత్ వైపు వస్తున్న నౌకపై దాడి జరగడం కలకలం రేపుతోంది. ఈ దాడిలో ముగ్గురు గల్లంతయ్యారు. UAE నుంచి థాయ్‌లాండ్‌కు చెందిన కార్గో నౌక.. హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ విషయాన్ని రాయల్ థాయ్ నేవీ ప్రకటించింది. ఆ నౌక UAEలోని ఖలిఫా పోర్టు నుంచి బయలుదేరిందని.. గుజరాత్‌లోని కాండ్లా పోర్ట్‌కు వెళ్తోందని తెలిపింది. ఈ క్రమంలోనే హర్ముజ్ జలసంధి మీదుగా వెళ్తున్నప్పుడు ఈ దాడి జరిగినట్లు తెలిపింది. ఈ దాడికి గల కారణాలపై విచారణ చేస్తున్నామని పేర్కొంది.
Iran strikes a Thai ship passing through Strait of Hormuz.
— Aryan (@chinchat09) March 11, 2026
The vessel named MAYUREE NAREE, a Thai flag ship was hit by a projectile #IranUsWar#Tehranpic.twitter.com/SmPQp6Pszzhttps://t.co/opfQeigSxV
Also Read: పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా.. వరుడు ఎవరో తెలుసా ?
అయితే ఒమన్ నౌకాదళం ఆ కార్గోషిప్‌లో 20 మంది నావీ సిబ్బందిని రక్షించినట్లు చెప్పింది. మరో ముగ్గురు గల్లంతయ్యారని వాళ్ల ఆచూకి కోసం గాలిస్తున్నట్లు తెలిపింది. ఈ దాడి ఎవరు చేశారనేది ఇప్పటికీ క్లారీటీ లేదు. ఏ గ్రూప్ కూడా దీనికి బాధ్యత వహిస్తూ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ దాడి ఇరానే చేసినట్లు అంతర్జాతీయా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు మంగళవారం కూడా పర్షియల్ గల్ఫ్‌లో మూడు వాణిజ్య నౌకలపై దాడులు జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది.
Also Read: వంట గ్యాస్ సిలిండర్ల కొరత.. కేంద్రం సంచలన ప్రకటన
ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తు్న్న సంగతి తెలిసిందే. ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో ఇరాన్ హర్ముజ్ జలసంధిని తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. ఇప్పటికే ఆ జలసంధి మీదుగా వెళ్లే నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఆ రూట్‌లో చమురు, గ్యాస్ రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే పలు దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. భారత్‌లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. అయితే కేంద్రం మాత్రం దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. LPG ఉత్పత్తిని 25 శాతం పెంచినట్లు పేర్కొంది. చమురు, గ్యాస్‌ను హర్ముజ్ జలసంధి రూట్ ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో దిగుమతి చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
Follow Us