Iran : ఇదిగో లిస్ట్.. దమ్ముంటే ఈ 8 వంతెనలు కాపాడుకో.. ట్రంప్ కు ఇరాన్ సంచలన సవాల్!

మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఇప్పుడు భీకర రూపం దాల్చింది. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన ఈ  యుద్ధం అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇరాన్‌లోని అత్యంత ఎత్తైన నిర్మాణ బ్రిడ్జిని అమెరికా

New Update
iran

మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఇప్పుడు భీకర రూపం దాల్చింది. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన ఈ  యుద్ధం అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇరాన్‌లోని అత్యంత ఎత్తైన నిర్మాణ బ్రిడ్జిని అమెరికా కూల్చివేయడం, దానికి ప్రతిగా ఇరాన్ అగ్ర దేశాలకు చెందిన 8 వ్యూహాత్మక వంతెన(8 steel bridges) ల జాబితాను విడుదల చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.

గురువారం అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్‌లోని అత్యంత ఎత్తైన B1 వంతెనపై విరుచుకుపడ్డాయి. టెహ్రాన్‌(Tehran Blast) ను కరాజ్ నగరంతో అనుసంధానించే ఈ 136 మీటర్ల ఎత్తైన వంతెనపై జరిగిన రెండు దాడుల్లో 8 మంది మరణించగా, 95 మంది గాయపడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, వంతెన మధ్య భాగం పూర్తిగా కూలిపోయింది.

Also Read :  ట్రంప్ సర్కార్‌లో ప్రక్షాళన: కీలక అధికారులపై వేటు!

ఇరాన్‌కు హెచ్చరిక 

ఈ దాడి అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌ను హెచ్చరించారు. "ఇరాన్‌లోని అతిపెద్ద వంతెన కూలిపోయింది, అది ఇక పనికిరాదు. ఇంకా చాలా జరగాల్సి ఉంది! సమయం మించిపోకముందే ఇరాన్ చర్చలకు రావాలి" అని పేర్కొన్నారు. ఇరాన్‌ను శిలా యుగం నాటి రోజుల్లోకి తీసుకెళ్తామని ఆయన ఇదివరకే వ్యాఖ్యానించడం గమనార్హం.

అమెరికా దాడికి ప్రతికారంగా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లక్ష్యంగా చేసుకోబోయే 8 ప్రముఖ వంతెనల జాబితాను ఇరాన్ విడుదల చేసింది.

కువైట్: షేక్ జాబేర్ అల్-అహ్మద్ అల్-సబా బ్రిడ్జ్.

యూఏఈ (UAE): షేక్ జాయెద్ బ్రిడ్జ్, అల్ మక్తా బ్రిడ్జ్, షేక్ ఖలీఫా బ్రిడ్జ్.

సౌదీ - బహ్రెయిన్: కింగ్ ఫహద్ కాజ్‌వే (సౌదీని బహ్రెయిన్‌తో కలిపే కీలక మార్గం).

జోర్డాన్: కింగ్ హుస్సేన్ బ్రిడ్జ్, దామియా బ్రిడ్జ్, అబ్దౌన్ బ్రిడ్జ్.

నిర్మాణంలో ఉన్న పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం ఇరాన్‌ను లొంగదీసుకోలేవు. ఇది శత్రువుల నైతిక పతనానికి నిదర్శనం" అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే, పశ్చిమాసియాలో యుద్ధం కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా, దేశాల ఆర్థిక వెన్నెముకలైన రవాణా మార్గాలపై పడేలా కనిపిస్తోంది.

Also Read :  పాకిస్థాన్‌లో బతకడం ఘోరం..  లీటర్ డీజిల్ రూ. 520 బాసూ.. పెట్రోల్ ఎంతో తెలుసా?

Advertisment
తాజా కథనాలు