రష్యా యుద్ధంలో భారతీయులు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

రష్యాలో చిక్కుకున్న 26 మంది భారతీయులను స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.

New Update
Supreme Court agrees to hear plea seeking repatriation of 26 Indians allegedly detained in Russia

Supreme Court agrees to hear plea seeking repatriation of 26 Indians allegedly detained in Russia

రష్యాలో చిక్కుకున్న 26 మంది భారతీయులను స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఉపాధి కోసం రష్యాకు వెళ్లి ఏజెంట్ల ద్వారా తమ వారు మోసపోయారని బాధిత కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రష్యా సైన్యంతో కలిసి బలవంతంగా యుద్ధంలో పాల్గొంటున్నారని వాపోయారు. ప్రస్తుతం అక్కడ నిర్బంధంలో ఉన్న తమ వాళ్ల పరిస్థితిని తెలియజేసి, త్వరగా స్వదేశానికి రప్పించాలంటూ కోరారు. 

Also read: నెతన్యాహుపై అవినీతి కేసులు.. ఇరాన్ సంచలన ఆరోపణలు

పిటిషినర్‌ తరఫు న్యాయవాది ఈ అంశాలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించారు. రష్యా సైన్యంలో బలవంతంగా భారతీయులను చేర్చుకున్నారని వీళ్లలో కొందరు యువకులు గాయపడ్డట్లు తెలిపారు. మరికొందరు నిర్బంధంలో ఉన్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని సుప్రీం ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. 

Also read: ఇజ్రాయెల్ Vs పాకిస్థాన్.. వీరి గొడవ ఇప్పటిది కాదు.. షాకింగ్ స్టోరీ!

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహదా దీనిపై స్పందించారు. ఈ పిటిషన్‌ను నిశితంగా పరిశీలిస్తామన్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి సూచనలు తీసుకుంటామని తెలిపారు. దీంతో కేంద్రం వివరణను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్‌ చివరికి వాయిదా వేసింది. రష్యాలో భారతీయులు చిక్కుకోవడం, వాళ్లని యుద్ధ రంగంలోకి బలవంతంగా పంపిచిన ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. వాళ్లని వెంటనే వెనక్కి రప్పించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.  

Advertisment
తాజా కథనాలు