Global Warming: వేడెక్కుతున్న భూమి.. రాబోయేది సాధారణ వేసవి కాదు, 'సూపర్ ఎల్ నినో' కాలమే!

గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల భూమిపై వేడి రోజురోజుకు పెరుగుతోంది. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత భయంకరంగా మారొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

New Update
Global Warming

Global Warming

గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల భూమిపై వేడి రోజురోజుకు పెరుగుతోంది. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత భయంకరంగా మారొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో 'ఎల్ నినో' ప్రభావం సాధారణంగా కాకుండా.. అత్యంత ప్రమాదకరమైన 'సూపర్ ఎల్ నినో'గా మారే ఛాన్స్ కనిపిస్తోంది. దక్షిణ అమెరికా తీరంలోని పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఎల్‌నినో అనేది ఏర్పడుతుంది. సాధారణంగా తూర్పు నుంచి పడమర వైపునకు వీచే సముద్ర గాలులు ఎల్ నినో సమయంలో తమ దిశను మార్చుకోవడం వల్ల ప్రపంచ వాతావరణ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమవుతుంది.

ఈ ఏడాది దీని ముప్పు మరింత తీవ్రంగా ఉండటానికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో వేగవంతమైన మార్పులే. ప్రస్తుతం మధ్య పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే 0.9 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయి. దీనికి తోడు గత ఆరు నెలలుగా సముద్ర గర్భంలో భారీ వెచ్చని నీటి జలాశయం తయారైంది. ప్రసుతం అది పైకి వచ్చేస్తోంది. ఈ నీరు పూర్తిగా పైకి వచ్చినప్పుడు సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువ నమోదైతే దాన్ని "సూపర్ ఎల్ నినో"గా పిలుస్తారు. గత 70 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే కేవలం 1982, 1997, 2015 సంవత్సరాల్లో మాత్రమే ఇలాంటి తీవ్రత కనిపించింది. ఈ ఏడాది సముద్రం వేడెక్కుతున్న వేగాన్ని చూస్తే  గత 150 ఏళ్లలోనే అత్యంత శక్తివంతమైన, వినాశకరమైన ఎల్ నినోగా మారే ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Also Read: భీకర కాల్పులు.. 25 మంది మృతి

ఈ సూపర్ ఎల్‌నినో ఎఫెక్ట్‌ వల్ల భారత్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది. దీంతో దేశంలోకి వచ్చే నైరుతి రుతుపవనాలు గణనీయంగా బలహీనపడి, వర్షపాతం భారీగా తగ్గే ఛాన్స్ ఉంది. దీని ఫలితంగా దేశంలోని పలు వ్యవసాయ ఆధారిత ప్రాంతాలలో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే మే, జూన్ నెలల్లో కూడా ఉత్తర, మధ్య, పశ్చిమ భారత్‌లో ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 48 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ దాటే ఛాన్స్ ఉంది.

సాధారణంగా చూసుకుంటే రెండు మూడు రోజులు మాత్రమే ఉండే వడగాలులు (హీట్ వేవ్స్) ఉంటాయి. కానీ ఈసారి వారాల తరబడి సుదీర్ఘంగా కొనసాగే ముప్పు ఉంది. రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలపై ఈ ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరగడమే కాక తీవ్ర నీటి సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉంది.

2015లో సంభవించిన సూపర్ ఎల్ నినో వల్ల భారత రుతుపవనాలు 14 శాతం బలహీనపడ్డాయి. దేశంలోని అనేక రాష్ట్రాలు కరవుకు గురయ్యాయి. దీంతో 1997లో వచ్చిన సూపర్ ఎల్‌నినో అల్లకల్లోలం సృష్టించింది. ఈ సమయంలో పెరూ దేశంలో భారీ వరదలు ముంచెత్తాయి. ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో తీవ్రమైన కరవులు, నియంత్రించలేని కార్చిచ్చులు వచ్చాయి. 1982లో కూడా ప్రపంచ వాతావరణ సమతుల్యతపై దెబ్బపడింది. ప్రస్తుత పరిస్థితులు ఆనాటి పాత రికార్డులను కూడా అధిగమించేలా ఉండటం వల్ల శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

Also Read: మళ్లీ భయపెడుతున్న కరోనా.. కొత్తగా 12,700 కేసులు..

గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాల సాధారణ ఉష్ణోగ్రత ఇప్పటికే పెరిగిపోయింది. ఇలాంటి కఠిన సమయంలో ఎల్‌నినో తోడవడం అంటే.. మండుతున్న నిప్పుకు గాలి కలిసినట్లే. ఉదాహరణకు గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెరిగితే.. ఈ సూపర్ ఎల్ నినో దానికి మరో 2 డిగ్రీలను జోడించి, ఉమ్మడిగా 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతల తీవ్రతను పెంచుతుంది. ఇవి రెండు ఏకకాలంలో కలవడం వల్ల ఈ ఏడాది భూమి వేడి మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులను ఎదుర్కునేందుకు ప్రపంచ దేశాలన్నీ ముందస్తుగా అలెర్ట్ కావాలని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు