/rtv/media/media_files/2024/12/24/FrUuZy5JJCftMJ1kyXfQ.jpg)
Sunitha Williams Christmas Photograph: (NASA)
ఎనిమిది నెలల నిరీక్షణ ఫలించింది. భార రహిత స్థితిలో అంతరిక్షంలో ఇబ్బందులు పడుతున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు ఎట్టకేలకు భూమి మీదకు తిరిగి రానున్నారు. వీరిని మార్చి మధ్యలో నేల మీదకు తీసుకువచ్చేందుకు స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యోమనౌకను పంపనుందని నాసా ప్రకటించింది.
ఎనిమిది నెలలుగా అక్కడే..
గత జూన్ 5న భారత సంతతి ఆస్ట్రోనాట్ అయిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. వీరిని తీసుకెళ్లిన స్టార్‌లైనర్ ప్రొపల్షన్‌తో సమస్యలు తలెత్తడంతో వారు ఎనిమిది నెలలుగా అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు ఆరోగ్యం మీద అనేక అనుమానాలు తలెత్తాయి. వారు చనిపోతారని ఆందోళనలు రేగాయి. అయితే నాసా వీటన్నిటికీ ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంది. వ్యోమగాముల ఆరోగ్యం మీ శ్రద్ధ తీసుకుంటున్నామని...ఎపటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెబుతూనే ఉంది. వ్యోమగాముల ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో సునీతా విలియమ్స్ మరో సహచర ఆస్ట్రోనాట్ విల్‌మోర్‌తో కలిసి గురువారం ఉమ్మడిగా స్పేస్‌వాక్ చేశారు. తాజాగా చేసిన స్పేస్‌వాక్‌తో కలిపి సునితా విలియమ్స్ 62 గంటల 6 నిమిషాల పాటు పూర్తి చేశారు. దీంతో నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ వైట్‌సన్ స్పేస్‌వాక్ 60 గంటల రికార్డును ఆమె బ్రేక్ చేశారు. అలాగే స్పేస్‌వాక్ టాప్ 10 జాబితాలో కూడా సునీతా నాలుగో స్థానానికి చేరారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సంచలనం సృష్టించారు. అంతరిక్షంలో ఎక్కువ సమయం నడిచిన మహిళా వ్యోమగామిగా రికార్డ్ నెలకొల్పారు. ఈ వీడియోను నాసా పోస్ట్ చేసింది.
Also Read: UN: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు..1400 మంది మృతి-ఐక్యరాజ్యసమితి