USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు

సునీతా విలియమ్స్ మరో ముగ్గురు వ్యోమగామలతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్  17 గంటల ప్రయాణం తర్వాత భూవాతావరణంలోకి సేఫ్ గా ల్యాండ్ అయింది. అన్ని ప్రక్రియలూ సవ్యంగా జరిగి వ్యోమగాములు సురక్షితంగా నేల మీదకు అడుగుపెట్టారు.

author-image
By Manogna alamuru
New Update

సునీతా విలియమ్స్ మరో ముగ్గురు వ్యోమగామలతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్  17 గంటల ప్రయాణం తర్వాత భూవాతావరణంలోకి సేఫ్ గా ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుఝామున 2.41 గంటలకు డ్రాగన్ క్యాప్సూల్ ప్రవేశించింది. తర్వాత దాని ఇంజిన్లను ప్రజ్వలింపజేశారు. ఇదే టైమ్ లో నాసాలో శాస్త్రవేత్తలతో పాటూ అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకుంది. ఇక్కడే డ్రాగన్ క్యాప్సూల్స్ తో పాటూ వ్యామగాములు సురక్షితంగా ల్యాండింగ్ అవడం చాలా ముఖ్యం.  గంటకు 116 మైళ్ల వేగంతో వ్యోమనౌక భూమి దిశగా పయనించింది. భూమికి చేరువయ్యే కొద్దీ అందులోని పారాచ్యూట్‌లు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. అవి గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా సముద్రంలోకి క్యాప్సూల్స్‌ సురక్షితంగా దిగింది. తెల్లవారుజామున 3: 27 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్రంలో క్యాప్సూల్ దిగింది. 

usa
Dragon Crew Landing

 

usa
Astronauts First Picture

 

usa
Sunitha Williams

 

హ్యూస్టన్ స్పేస్ సెంటర్ కు..

దీని తర్వాత కాసేపటికి క్యాప్సూల్ దగ్గరకు నాసా సిబ్బంది బోట్స్ లో చేరారు. ఆ తరువాత రిగ్గింగ్ అనే ప్రక్రియను చేపట్టారు.  ఇందులో క్యాప్సూల్ ను నాసా సిబ్బంది ఒక షిప్ లోకి చేర్చారు. అక్కడ దానికి భద్రతా పరీక్షలు నిర్వహించారు. క్యాప్సూల్ ను కూల్ చేసేందుకు నీటితో తడిపారు. అ  తర్వాత మళ్ళీ సహాయక సిబ్బంది బృందం భద్రతా పరీక్షలు నిర్వహించారు.  అనంతరం డ్రాగన్ కాప్సూల్‌ను తెరిచి.. లోపలి నుంచి వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. ముందుగా నిక్ హేగ్, గోర్బునోవ్‌లు వారి తర్వాత సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు బయటకొచ్చారు. ఒకొక్కరుగా బయటకు వచ్చిన ఆస్ట్రోనాట్స్ నవ్వూతూ అందరికీ హాయ్ చెప్పారు. తాము ఆరోగ్యంగా, సురక్షితంగా ఉననామనే సంకేతాలనిచ్చారు. దీని తరువాత సునీతా విలియమ్స్, మిగతా వారిని నాసా ప్రత్యేక విమానంలో హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. ఆ తరువాత వ్యోమగాములు తమ కుటుంబసభ్యలను కలుస్తారని నాసా ప్రకటించింది. వ్యోమగాముల సేఫ్ ల్యాండింగ్ పై నాసా మరి కొద్ది సేపటిలో అధికారిక ప్రకటన చేయనుంది. 

తొమ్మిది నెలల సుదీర్ఘ ఎదురుచూపులు తర్వాత..

క్రూ డ్రాగన్‌–10 స్పేస్ షిప్ హ్యాచ్‌ ను భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 8.15కు మొదలైంది. దీని తర్వాత అన్ డాకింగ్ జరిగి ఐఎస్‌ఎస్‌ నుంచి క్యాప్సుల్ విడివడే ప్రక్రియ ఉదయం 10.35కు అయింది. అక్కడి నుంచి వ్యోమగాముల ప్రయాణం మొదలయింది. వీరు దాదాపు 17 గంటల ట్రావెలింగ్ తర్వాత భూవాతావరణంలోకి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియలన్నింటినీ హ్యూస్టన్ లోని నాసా కేంద్రం నుంచి నిర్వహిస్తున్నారు.

Also Read: USA: చైనా డీప్ సీక్ పై అమెరికా ఉక్కుపాదం..ప్రభుత్వ డివైజ్ లలో వద్దంటూ..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు