USA: అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు

అమెరికాలో చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు చాలా ఇబ్బందులు వెతుక్కుంటున్నారు. బయట ఉద్యోగాలు చెయ్యనివ్వకుండా అధికారులు గట్టి నిఘా పెట్టారు. దీంతో స్టూడెంట్స్ కు డబ్బులు చాలక చాలా ఇబ్బందులు పడుతున్నారు. 

New Update
us

Students In USA

ఇతర దేశాల నుంచి అమెరికాకు చదువుకోవడానికి చాలా మంది విద్యార్థులు వస్తారు. ఇక్కడ డిగ్రీలకు చాలా వాల్యూ ఉండడమే కాదు..క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఉంటుందని ఒక నమ్మకం. అందుకే ఏడాదికి వేలల్లో విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వస్తారు. అయితే ఇందులో స్కాలర్ షిప్ మీద వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. చాలా బాగా చదువుకుంటేనే స్కాలర్ షిప్ వస్తుంది. మామూలుగా చదువుకునే వారికి అంత ఈజీ కాదు. కానీ చాలా మంది బ్యాంకుల్లో లోన్ లు పెట్టుకుని, తల్లిదండ్రులు డబ్బులు పెడితే కూడా చదువుకోవడానికి వస్తుంటారు భవిష్యత్తు బాగుంటుందని. 

అమెరికా చదువు చాలా కాస్ట్లీ...

అమెరికాలో యూనివర్శిటీ, కాలేజీ ఫీజులు చాలా ఎక్కు ఉంటాయి. వాటిని కడుతూ, ఇక్కడ బతకాలి అంటే కచ్చితంగా ఉద్యోగం చేయాల్సిందే. వాళ్ళ రోజువారీ ఖర్చుల కోసమైనా డబ్బులు కావాలి. అందుకే నూటికి ఎనభై శాతం మంది విద్యార్థులు చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటారు. యూనివర్శిటీ క్యాంపస్ లలో కూడా ఉద్యోగాలు ఉంటాయి. అయితే అందరికీ రావు. దాంతో బయటకు వచ్చిన గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లలో, షాప్స్ లలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటారు. 

బయట ఉద్యోగం చేస్తూ దొరికితే ఇంటికే..

ట్రంప్ వచ్చాక రూల్స్ మార్చేశారు. విద్యార్థులు బయట ఉద్యోగాలు చేసేందుకు వీలు లేదని స్ట్రిక్ట్ కండిషన్ పెట్టారు. అలా బయట ఉద్యోగాలు చేస్తూ దొరికితే వారి స్టూడెంట్ వీసాలను వెంటనే క్యాన్సిల్ చేయించి..వెనక్కు పంపేస్తున్నారు. ట్రంప్ వచ్చాక చాలా మంది విద్యార్థులు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. రూల్స్ ప్రకారం విద్యాసంస్థలో వారానికి 20 గంటల చొప్పున ఆన్‌ క్యాంపస్‌ జాబ్‌ పేరిట పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసుకోవచ్చు. వేసవి సెలవులు, సెమిస్టర్ల మధ్యలో వారానికి 40 గంటలు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువుకుంటూ క్యాంపస్ బయట మాత్రం పార్ట్‌టైమ్‌ కొలువు చేయడానికి వీల్లేదు. అయితే క్యాంపస్ లో ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి. అందుకే బయట ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులపై భారం తగ్గిస్తారు విద్యార్థులు.

ఇప్పుడు క్యాంపస్ లలో అధికారులు వెయ్యి కళ్ళేసుకుని విద్యార్థులను గమనిస్తున్నారు. ఎప్పుడు ఎవరు దొరికినా వెంటనే రూల్స్ అంటూ బయటకు పంపేస్తున్నారు. దీంతో అందరూ ఉద్యోగాలు మానేసారు. దానివలన ఇప్పుడు వారు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల పోయాక పరిస్థితి మారవచ్చును. అంతా బాగుండొచ్చును అనుకుంటున్నారు కానీ..ఈలోపు మాత్రం డబ్బుల కోసం తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. రోజువారీ ఖర్చులకు డబ్బులు పంపించమని అడుగుతున్నారు. 

Also Read: USA: విమానాన్ని ఢీకొట్టకుండా ఎందుకు ఆపలేకపోయారు..అధ్యక్షుడు ట్రంప్ అనుమానం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు