/rtv/media/media_files/2025/03/18/togt2grEveorqpKV91fa.jpg)
Astronauts Returning to Earth
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు తిరిగొచ్చే మిషన్ ప్రారంభమైంది. సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్–10 స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమ్మీదకు తిరిగి వస్తున్నారు. తొమ్మది నెలల తర్వాత వీరు నేల మీదకు తిరిగి వస్తున్నారు. ఎనిమిది రోజుల కోసం వెళ్ళిన వ్యోమగాములు.. వారు వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ లో టెక్నికల్ సమస్యలు రావడంతో అక్కడే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తొమ్మిది నెలల తర్వాత ఆ ప్రయత్నాలు సఫలం అయ్యాయి. తాజాగా క్రూడ్రాగన్ 10 డాకింగ్ సక్సెస్ కావడంతో వీళ్లు భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమం అయింది.
LIVE from the @Space_Station: @NASA_Astronauts Butch Wilmore and Suni Williams discuss their @BoeingSpace #Starliner Crew Flight Test mission. https://t.co/Tsp7CjfjU7
— NASA (@NASA) July 10, 2024
క్రూ డ్రాగన్–10 స్పేస్ షిప్ హ్యాచ్ ను భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 8.15కు మొదలైంది. దీని తర్వాత అన్ డాకింగ్ జరిగి ఐఎస్‌ఎస్ నుంచి క్యాప్సుల్ విడివడే ప్రక్రియ ఉదయం 10.35కు అయింది. అక్కడి నుంచి వ్యోమగాముల ప్రయాణం మొదలవుతుంది. ఈ మిషన్ సక్సెస్ అయితే బుధవారం తెల్లవారుజాము 2.41 గంటలకు వ్యోమనౌక భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుందని నాసా తెలిపింది. తెల్లవారుజామున దాదాపు 3.30 గంటలకు ఫ్లోరిడా తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ క్యాప్సూల్ దిగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియలన్నింటినీ హ్యూస్టన్ లోని నాసా కేంద్రం నుంచి నిర్వహిస్తున్నారు. భూమి మీదకు అత్యంత వేగంగా దిగే క్యాప్సూల్ ను పారాచ్యూట్ ల ద్వారా కంట్రోల్ చేస్తారు. అలా వారు సముద్రంలో దిగుతారు. వెంటనే వెంటనే నాసా టెక్నీషియన్స్, స్విమ్మర్స్ నలుగురు ఆస్ట్రోనాట్స్‌ను క్యాప్సూల్ నుంచి వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీస్తారు. వారిని నాసా సెంటర్‌కు తరలించి అవసరమైన వైద్య చికిత్స అందిస్తారు.
This is the moment astronauts Sunita Williams and Butch Wilmore welcomed a new NASA crew at the International Space Station, paving the way for them to finally return home.
— DW News (@dwnews) March 17, 2025
Their eight-day trip was extended to over nine months after a series of technical failures. pic.twitter.com/kvZAijRhtJ
భూమి మీదకు చేరేలోపు ఎన్నో సవాళ్ళు..
అయితే ఇదంతా అనుకున్నంత ఈజీ కాదు. భగ్గుమనే ఉష్ణోగ్రతలను తట్టుకుని వ్యోమగాములు ప్రయాణిస్తున్న క్యాప్సూల్ భూమి మీదకు చేరుకోవాలి. ఆస్ట్రోనాట్ లు అంతరిక్షంలోకి ప్రవేశించడం ఎంత కష్టమో తిరిగి రావడం కూడా అంతే కష్టం. ప్రస్తుతం టెక్నాలజీ అన్ని రకాలుగా చాలా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ ఈ ప్రక్రియ డేంజరే అనే చెప్పాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. వ్యోమగాములు భూమి మీదకు తిరిగి వచ్చే ప్రక్రియను అట్మాస్ఫియరిసటిక్ రీ ఎంట్రీ అని అంటారు. అత్యంత ప్రమాదకరమైన దశల్లో ఇది ఒకటి. ఇందులో హీట్ షీల్డ్స్, పారాచ్యూట్స్, నేవగేషన్లు కీలకపాత్ర పోషిస్తాయి. స్పేస్ క్రాఫ్ట్ లు భూమి మీదకు తిరిగి వస్తున్నప్పుడు మండుతూ ఉంటాయి. క్యాప్సూల్స్ వచ్చే వేగానికి కొన్ని వేల డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. వాతావరణంలో మార్పులు, వేడి కూడా దీనికి కారణం అవుతుంది. దీని నుంచి కాపాడేవే హీట్ షీల్స్డ్. భూమి మీదకు తిరిగివచ్చే స్పేస్ క్రాఫ్ట్ లకు తగ్గట్టుగా వీటిని అమర్చుతారు. భారీ ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ ఇవి క్యాప్సూల్స్ ను కాపాడతాయి. వీటి తర్వాత పారాచూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి క్యాప్సూల్స్ వేగాన్ని తగ్గించి భూమి మీదకు సురక్షితంగా చేరడంలో సహాయం చేస్తాయి. వీటన్నింటికీ నేవిగేషన్ తోడై స్పేస్ క్రాఫ్ట్ ను సరైన ప్రదేశంలో దించేలా చేస్తుంది. వీటిల్లో ఏ ఒక్క వ్యవస్థ సరిగ్గా పని చేయకపోయినా అవి పేలిపోవడమో, కూలిపోవడమూ జరుగుతుంది. కల్పనా చావ్లా మరికొంత మంది వ్యామగాములు చనిపోవడానికి ఇదే కారణం.
Dragon on-orbit shortly after undocking from the @Space_Station pic.twitter.com/lxmTIJuf99
— SpaceX (@SpaceX) March 18, 2025
కల్పనా చావ్లా ఎలా చనిపోయారు..
2003 ఫిబ్రవరి 1.. అంతరిక్షయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం చోటు చేసుకున్న రోజు.స్పేస్ నుంచి భూమికి చేరుకునే క్రమంలో గాలిలోనే కాలిపోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. మరికొద్ది సేపటిలో నేల మీదకు చేరుతుందనగా..పేలిపోయింది. దీంట్లో భారత్‌కు చెందిన కల్పనా చావ్లాతో సహా ఏడుగురు ఆస్ట్రోనాట్స్ చనిపోయారు. 16 రోజులపాటు అంతరిక్షంలో గడిపాక 2003 ఫిబ్రవరి 1న కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లో మళ్లీ భూమికి పయనమైంది కల్పనా చావ్లా బృందం. బయలుదేరే ముందు స్పేస్ క్రాఫ్ట్‌కు సంబంధించి ఆస్ట్రోనాట్స్ చేసిన భద్రతా పరీక్షల్లో అంతా సవ్యంగానే కనిపించింది. తర్వాత భూమికి సుమారు 282 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో బయలుదేరింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. భారత కాలమానం ప్రకారం సాయంత్రం పావు తక్కువ ఏడు గంటల సమయంలో.. భూ120 కి.మీ ఎత్తులో వాతావరణంలోకి ప్రవేశించింది స్పేస్ క్రాఫ్ట్. అప్పటి వరకు బాగానే ఉన్న స్పేస్ క్రాఫ్ట్ నుంచి అబ్‌నార్మల్ రీడింగ్స్ నాసా మిషన్ కంట్రోల్ రూమ్‌కు రావడం మొదలైంది. స్పేస్ క్రాప్ట్ ఎడమ రెక్కలో ఉండే టెంపరేచర్ సెన్సార్ల నుంచి సమాచార ప్రసారం నిలిచి పోయింది. స్పేస్ క్రాఫ్ట్ టైర్ల ప్రెషర్‌కు సంబంధించిన డేటా కూడా కనిపించకుండా పోయింది. ఆ తర్వాత గ్రండ్ కంట్రోల్ రూమ్ తో సంబంధాలు తెగిపోయాయి. చివరకు సుమారు 61 కి.మీ ఎత్తులో స్పేస్ క్రాఫ్ట్ కాలి పోయి ముక్కలుగా విడిపోయింది. ఈ ప్రమాదంలో కల్పనా చావ్లాతో సహా బృందంలోని మొత్తం ఏడుగురూ చనిపోయారు.
ఆరోగ్య సమస్యలు..
అయితే ఇవన్నీ సవ్యంగా జరిగి వ్యోమగాములు భూమి మీదకు సురక్షితంగా తిరిగి వచ్చినా వారికి నార్మల్ గా జీవించడం అంత సులభమేమీ కాదు. వారం, పది రోజులు అయితే అంతరిక్షంలోని భార రహిత స్థితి నుంచి తొందరగానే బయటపడొచ్చు. కానీ తొమ్మిది నెలలు అక్కడే ఉండి వచ్చిన సునీతా విలియమ్స్ కు ఇది పెద్ద సవాల్ గా మారనుంది. అంతరిక్షంలో, భూమి మీద వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి. దీంతో ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ కొన్ని రోజుల దాకా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొననున్నారు. స్పేస్ స్టేషన్‌లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి.. ఇన్ని రోజులు వారు గాలిలోనే తేలియాడారు. సడెన్‌గా భూమి మీదకు వచ్చి నడవడం వంటివి చేయాలంటే వారికి చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వారు కొన్ని అనారోగ్య సవాళ్లు ఎదుర్కొననున్నారు.
కండరాలు, ఎముకల క్షీణత
అంతరిక్షంలో తక్కువ గురుత్వాకర్షణ వాతావరణంలో జీవించడం వల్ల కండరాల క్షీణత, ఎముక సాంద్రత తగ్గుతుంది. ఆస్ట్రోనాట్స్ భూమిపై ఉన్నప్పుడులా కండరాలు కదిలించలేరు. కాబట్టి, కాలక్రమేణా వారి బలం తగ్గుతుంది. అంతరిక్షంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ.. భూమి మీద వారు బలహీనతగా ఉండొచ్చు. పూర్తి బలాన్ని తిరిగి పొందడానికి కొంత టైం పడుతుంది.
బాడీ బ్యాలెన్సింగ్ అండ్ కో ఆర్డినేషన్ ప్రాబ్లమ్స్
నెలల తరబడి అంతరిక్షంలో గడిపారు కాబట్టి.. సునీతా విలియన్స్, బుచ్ విల్మోర్‌ల బాడీ బ్యాలెన్సింగ్, శరీర అవయవాల సమతుల్యత కదలికలను నియంత్రించే వ్యవస్థ సూక్ష్మ గురుత్వాకర్షణకు అలవాటుపడుతుంది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములు తలతిరగడం, దిక్కుతోచని స్థితి, నడవడానికి ఇబ్బంది లాంటివి ఎదురవుతాయి. భూమి గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా వారి శరీరం మారాలంటే రోజులు లేదా వారాల టైం పట్టవచ్చు. అలాగే వీరి కంటి చూపు కడా మందగించే అవకాశాలున్నాయి. దాంతో పాటూ అంతరిక్షంలో శరీరంలోని ద్రవాలు పైకి కదులుతాయి. దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. తిరిగొచ్చిన వ్యోమగాములు భూమిపై నిలబడి ఉన్నప్పుడు తక్కువ రక్తపోటు, తలతిరుగుతూ ఉండవచ్చు. 59 ఏళ్ళ వయసులో సునీతా విలియమ్స్ ఇవన్నీ ఎలా తట్టుకుంటారో చూడాలి.
Also Read: USA: భారత సంతతి సుదీక్ష మిస్సింగ్ లో ట్విస్ట్..సీనియర్ తో కలిసి బార్ లో..