ఇండియా కోళ్లు, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేదం.. మరో 40 దేశాలు

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 దేశాల నుండి కోళ్లు, కోడిగుడ్లు, సంబంధిత ఉత్పత్తుల దిగుమతిపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ప్రకటించింది. ప్రజారోగ్యాన్ని కాపాడటం కోసమే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

New Update
poultry products

అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆరోగ్య ముప్పులను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 దేశాల నుండి కోళ్లు, కోడిగుడ్లు, సంబంధిత ఉత్పత్తుల దిగుమతిపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ప్రకటించింది. ప్రజారోగ్యాన్ని కాపాడటం, దేశ ఆహార భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో బర్డ్ ఫ్లూ వంటి ప్రమాదకరమైన వైరస్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ అంటువ్యాధులు పౌల్ట్రీ ఉత్పత్తుల ద్వారా తమ దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సౌదీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

పక్షుల ద్వారా వ్యాపించే వైరస్‌లు మానవులకు కూడా సోకే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దిగుమతి చేసుకునే ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని SFDA నిర్ణయించింది. వ్యాధులు ప్రబలిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, రాకముందే అడ్డుకట్ట వేయడం ఉత్తమమని ఈ నిషేధం విధించారు.

దేశాల జాబితా
సౌదీ అరేబియా విడుదల చేసిన ఈ తాజా నిషేధిత జాబితాలో ఆసియా, యూరప్, ఇతర ఖండాలకు చెందిన ప్రముఖ దేశాలు ఉన్నాయి. భారత్, చైనా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, నేపాల్, అఫ్ఘానిస్థాన్ వంటి పొరుగు దేశాలు. సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ పౌల్ట్రీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ నుండి భారీ మొత్తంలో మాంసం, గుడ్లు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ నిషేధంతో  ఎగుమతిదారులు నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే, సంబంధిత దేశాల్లో వ్యాధుల తీవ్రత తగ్గి, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల నుండి క్లియరెన్స్ లభించిన తర్వాతే ఈ ఆంక్షలను సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు