Russia : ఆకలి తీర్చుకోవడానికి తోటి సైనికులనే తింటున్న రష్యా జవాన్లు.. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంచలనం!

ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధం ఎంత భీభత్సంగా సాగుతుందో చెప్పడానికి ఇదే సాక్ష్యం. గత రెండేళ్లుగా సాగుతున్న పోరులో రష్యా సైనికులు ఆకలికి తట్టుకోలేక సొంత మనుషులనే చంపుకుని తింటున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

New Update
russia

ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధం ఎంత భీభత్సంగా సాగుతుందో చెప్పడానికి ఇదే సాక్ష్యం. గత రెండేళ్లుగా సాగుతున్న పోరులో రష్యా సైనికులు(jawans) ఆకలికి తట్టుకోలేక సొంత మనుషులనే చంపుకుని తింటున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం, చలికాలంలో ఆహారం అందకపోవడంతో ఈ దారుణమైన పరిస్థితి నెలకొందని ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఫొటోలు, ఆడియో రికార్డింగులతో సహా బయటపెట్టాయి. యుద్ధం కేవలం తుపాకులతోనే కాదు, ఆకలితో కూడా మనుషులను ఎలా మార్చేస్తుందో ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి.

రష్యా సైనికుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, టెలిగ్రామ్ మెసేజ్‌లను ఉక్రెయిన్ సైన్యం సంపాదించింది. ఇందులో కనీసం ఐదు చోట్ల రష్యా సైనికులు తమ తోటి వారిని చంపి మాంసాన్ని తిన్నట్లు ఆధారాలు లభించాయి. నవంబర్ 2025లో డొనెట్స్క్ ప్రాంతంలో క్రోమోయ్ అనే పిలుచుకునే ఒక సైనికుడు తన సహచరులను చంపి, మాంసం తింటూ పట్టుబడటం కలకలం రేపింది. అతడిని పట్టుకోవడానికి వెళ్లిన వారు ఈ భీభత్సాన్ని చూసి తట్టుకోలేక, అతడు తిరగబడటంతో అక్కడికక్కడే కాల్చి చంపేశారు. చనిపోయిన ఆ సైనికుడు ఆహారం లేక పూర్తిగా బక్కచిక్కిపోయి ఉండటం ఆకలి తీవ్రతను తెలియజేస్తోంది.

అధికారులు కూడా తమ సైనికులకు పంపే ఆదేశాల్లో మద్యం తాగొద్దు, నరమాంసం తినొద్దని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏప్రిల్ నెలలో కూడా ఒక సైనికుడు తన బంకర్‌లో ఉన్న వ్యక్తి శవాల మాంసం తింటున్నాడని, తన మతం ప్రకారం అది తప్పని వాపోయిన ఆడియో బయటకు వచ్చింది. ఈ అంశాలపై మిలిటరీ సర్జన్లు మాట్లాడుతూ.. వైరల్ అవుతున్న ఫొటోల్లోని గాయాలు యుద్ధంలో తగిలినవి కావని, ఎవరో పదునైన కత్తితో కావాలనే కోసిన గుర్తులని స్పష్టం చేశారు.

అయితే రష్యా మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. ఉక్రెయిన్ తమపై దుష్ప్రచారం చేస్తోందని, ఆ రికార్డింగులన్నీ కల్పితమని వాదిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆహారం లేక, పాతబడిన రేషన్లు తింటూ వేల సంఖ్యలో రష్యా సైనికులు ఉక్రెయిన్‌కు లొంగిపోతున్నారు. కేవలం రష్యానే కాదు, ఉక్రెయిన్ సైనికులు కూడా గత చలికాలంలో మంచును కరిగించి తాగుతూ, తిండి లేక తమ శరీర బరువులో సగానికి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అగ్రదేశాల పంతాల మధ్య సామాన్య సైనికుల బతుకులు ఇలా ఆకలికి ఆహుతవుతూ, నరమాంస భక్షణ స్థాయికి పడిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read :  వ్యూహం మార్చిన అమెరికా ..... దిమ్మ తిరిగే ప్లాన్ వేసిన ట్రంప్

ఆరోగ్యపరంగా చాలా ప్రమాదం

ఇది పక్కన పెడితే.. నరమాంసం తినడం అనేది నైతికంగా, సామాజికంగా ఎంత తప్పో, ఆరోగ్యపరంగా కూడా అంతకంటే ప్రమాదకరం. ఆకలితో అలమటించే యుద్ధ సమయాల్లో లేదా అత్యంత విషమ పరిస్థితుల్లో కొందరు ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడవచ్చు, కానీ దీని వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.  నరమాంసం తినడం వల్ల వచ్చే అతిపెద్ద ముప్పు ఏంటంటే..  మానవ మెదడులో ప్రియాన్స్ అనే వికృత ప్రోటీన్లు ఉంటాయి. వీటి వల్ల కురు అనే ప్రమాదకరమైన వ్యాధి వస్తుంది. ఇది మెదడును పూర్తిగా దెబ్బతీస్తుంది. దీనివల్ల నడకలో తడబాటు, తీవ్రమైన వణుకు, మాట పడిపోవడం జరుగుతుంది. చివరికి పిచ్చి పట్టినట్లు నవ్వుతూ చనిపోతారు.  దీనికి ఇప్పటివరకు ఎలాంటి చికిత్స లేదు. 

Also Read :  కొనసాగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు.. ఉక్రెయిన్‌ పై రష్యా బాంబుల వర్షం... అఫ్గాన్‌ పై పాక్‌ దాడి

Advertisment
తాజా కథనాలు