గాల్లో గల్లంతైన బోయింగ్ విమానం.. 125 మంది ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే?

రష్యాలో ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానం ఒక్కసారిగా రాడార్ నుంచి మాయమైపోయింది. 125 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా గల్లంతు కావడంతో ఆందోళన చెందారు. ఇంతలో విమానం సోచీ విమానాశ్రయంలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది.

New Update
russia flight

రష్యాలో ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానం ఒక్కసారిగా రాడార్ నుంచి మాయమైపోయింది. 125 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా గల్లంతు కావడంతో ఆందోళన చెందారు. ఇంతలో విమానం సోచీ విమానాశ్రయంలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  అయితే సాధారణంగా ఏదైనా విమానానికి రాడార్‌తో కనెక్షన్ కట్ అయిందంటే.. అది ఎక్కడో ఒకచోట కూలిపోయి ఉంటుందని భావిస్తారు. కానీ ఇలా జరగడం అరుదు అని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Indo-Pacific Command : భారత్‌కు షాకిచ్చిన అమెరికా : 'ఇండో' పదం తొలగింపు, వివాదాస్పద మ్యాప్..

అసలేం జరిగింది?

రష్యాకు చెందిన 'స్మార్టావియా' అనే విమానయాన సంస్థకు చెందిన 'బోయింగ్ 734-800' విమానం బుధవారం సాయంత్రం సోచీ నగరం నుంచి అర్ఖంగెల్స్క్‌కు బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 125 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నల్లసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. విమానం లోపల ఏదో సమస్య తలెత్తడంతో పైలట్లు వెంటనే విమానాశ్రయ కంట్రోల్ రూమ్‌కు అత్యవసర సంకేతాలు పంపారు. అలా సంకేతాలు పంపిన వెంటనే రాడార్ స్క్రీన్ల నుంచి ఆ విమానం ఒక్కసారిగా కనపడకుండా పోయింది.

ఇది కూడా చూడండి: Russia-India: ప్రపంచాన్ని శాసించే అరుదైన లోహాలు.. రష్యాతో భారత్ సీక్రెట్ డీల్!

దీంతో విమానాశ్రయ అధికారులు, రక్షణ సిబ్బంది ఒక్కసారిగా భయపడ్డారు. విమానం గల్లంతు కావడంతో అందరిలోనూ తీవ్ర ఆందోళన మొదలైంది. అయితే పైలట్లు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి.. రాడార్ కనెక్షన్ లేకపోయినప్పటికీ విమానాన్ని తిరిగి సోచీ విమానాశ్రయం వైపు మళ్లించారు. రన్ వే పైకి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా కిందకు దిగడంతో అధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గానీ, సిబ్బందికి గానీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు. అయితే విమానం ఇంజిన్‌లో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ సమస్య వచ్చిందని అధికారులు గుర్తించారు. 

ఇది కూడా చూడండి: Meenakshi Natarajan Case : రిటర్నింగ్‌ అధికారి vs ప్రజాస్వామ్యం

Advertisment
తాజా కథనాలు