/rtv/media/media_files/2026/02/04/russia-renews-attacks-on-frozen-ukrainian-cities-2026-02-04-07-31-21.jpg)
Russia renews attacks on frozen Ukrainian cities
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడులు చేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మంగళవారం వెల్లడించారు. తమపై రష్యా 450 దీర్ఘశ్రేణి డ్రోన్లతో సహా భిన్న రకాలకు చెందిన 70 మిసైల్స్‌ను ప్రయోగించిందని ఆరోపించారు. కీవ్‌లోని నాటో కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ పర్యటనకు ఓ రోజు ముందే ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అబుధాబిలో అమెరికా మధ్యవర్తిత్వం ద్వారా బుధవారం మళ్లీ శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి సమయంలో రష్యా దాడులు తీవ్రతరం చేసింది.
Also Read: అజిత్ పవార్ అంత్యక్రియల్లో బరితెగించిన దొంగలు..ఏడుగురు అరెస్ట్!
తమ దేశంలో విద్యుత్ సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణి దాడులు జరిగినట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. చలితీవ్రత పెరిగిన నేపథ్యంలో ఉక్రెయిన్ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించేలా రష్యా ఈ దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. తమకు గగనతల రక్షణ సాధనాలు సరఫరా చేయాలని, దురాక్రమణను ఆపేలా రష్యాపై ఒత్తిడి పెంచాలని మిత్రదేశాలను జెలెన్‌స్కీ అభ్యర్థించారు. ఉక్రెయిన్‌లోని అయిదు ప్రాంతాలపై రష్యా ఏకకాలంలో దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం తమ విద్యుత్ నెట్‌వర్క్‌పై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనంటూ ప్రైవేటు విద్యుత్ సంస్థ డీటెక్ వెల్లడించింది.
For Russia, exploiting the coldest days of winter to terrorize people is more important than diplomacy," wrote Volodymyr Zelensky.
— Belsat in English (@Belsat_Eng) February 3, 2026
Tonight, Russia attacked at least eight Ukrainian regions, including the capital. The enemy again attacked thermal power plants. In Kyiv, over 1,000… pic.twitter.com/j82od2ZjIV
Russia strikes civilian infrastructure in Ukraine city of Sumy, causing damage and injuries#RussiaUkraineWar#Sumy#RussianAirStrikes#Civilians#Warpic.twitter.com/e4heU6eFoQ
— News18 (@CNNnews18) February 4, 2026
Also Read: మోడీ కాంప్రమైజ్ .. దేశాన్ని అమ్మేశాడు.. రాహుల్ సంచలన ఆరోపణలు!
Follow Us