/rtv/media/media_files/2026/04/03/russia-2026-04-03-19-00-23.jpg)
Russia offers to scale up crude oil, LNG supplies to India amid West Asia crisis
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ముదురుతున్న నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ గుడ్‌న్యూస్ అందింది. భారత్‌కు ముడి చమురు, సహజ వాయువు సరఫరాను మరింత పెంచేందుకు రష్యా ముందుకొచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలసిందే. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో వరుస భేటీలు నిర్వహించింది. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో చమురు కొరత కలవరపెడుతున్న వేళ.. భారత్‌కు ముడి చమురు, సహజ వాయువు సరఫరాను మరింత పెంచుతామని రష్యా హామీ ఇచ్చింది.
ఇదిలాఉండగా పశ్చిమాసియాలో యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధి వద్ద అంతరాయం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నమైంది. అందుకే విదేశాల నుంచి ఇంధన దిగుమతులపై ఆధారపడే భారత్ లాంటి దేశాలకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రష్యా ముందుకొచ్చింది. అంతేకాదు ఈ భేటీలో చమురుతో పాటు ఎరువులు, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని విస్తరించడం గురించి చర్చలు జరిగాయి.
Also Read: దేశభక్తిని చాటుకున్న సీమా హైదర్.. కొడుకుకు 'భరత్' అనే పేరుతో నామకరణం
గతేడాది కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై సమీక్ష, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. మొత్తానికి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్న వేళ రష్యా నుంచి అదనపు సరఫరా హామీ రావడం భారత్‌కు ఊరటనిస్తోంది. మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారనుంది.
Follow Us