Russia-Ukraine: దేశం విడిచి వెళ్లండంటూ.. ఉక్రెయిన్‌కు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్

ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా అత్యంత శక్తిమంతమైన 'ఒరెష్నిక్' హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. వీటితో పాటు వందల సంఖ్యలో డ్రోన్లతో దాడులకు పాల్పడింది.

New Update
FotoJet (12)

ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా అత్యంత శక్తిమంతమైన 'ఒరెష్నిక్' హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. వీటితో పాటు వందల సంఖ్యలో డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అయితే ఈ దాడుల తర్వాత రష్యా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న కీలక ప్రభుత్వ భవనాలు, రక్షణ రంగ పరిశ్రమలు, డ్రోన్ల తయారీ కేంద్రాలు, కమాండ్ సెంటర్లే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ప్రాణనష్టం జరగకుండా ఉండాలంటే విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, సాధారణ ప్రజలు కీవ్ నగరాన్ని తక్షణమే ఖాళీ చేయాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

ఇది కూడా చూడండి: Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి ఊహించని షాక్.. ఆందోళనలో మూవీ టీమ్!

దాడులు తీవ్రంగా ఉండనున్నాయని..

ఈ ఉద్రిక్తతల మధ్య రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో టెలిఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. ఈ సంభాషణలో లావ్రోవ్, కీవ్‌లోని అమెరికా దౌత్య సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించాలని రూబియోకు సూచించారు. కీవ్‌లో త్వరలో జరగబోయే దాడులు అత్యంత తీవ్రంగా ఉండబోతున్నాయని.. అక్కడ ఉన్న విదేశీయుల భద్రతకు తాము బాధ్యత వహించలేమని రష్యా పరోక్షంగా హెచ్చరించింది. మిలిటరీ, పరిపాలనా కార్యాలయాలకు పౌరులు దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చూడండి: Total Fertility Rate : భారత్‌లో పడిపోతున్న జననాల రేటు (TFR)..... చైనా బాటలో దేశం.. ఆందోళనలో నిపుణులు!

రష్యా ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా రష్యా ప్రతిష్టాత్మకమైన రెడ్ స్క్వేర్ మిలిటరీ పరేడ్‌కు ఎలాంటి ఆటంకాలు రాకూడదని పుతిన్ ప్రభుత్వం మే నెల ప్రారంభంలోనే హెచ్చరించింది. అప్పుడు కూడా కీవ్ నగరంపై భారీ దాడులు ఉంటాయని బెదిరించింది. అయితే ఇలాంటి రష్యా బెదిరింపులకు తాము ఏ మాత్రం భయపడమని, తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు