ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలి: రష్యా

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని మరోసారి స్పష్టం చేసింది. భారత్, బ్రెజిల్, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత ప్రాతిపదికన ప్రాతినిధ్యం కలిగి ఉండాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు.

New Update
russia 2

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో(UNSC) భారత్‌కు ఇంతవరకు శాశ్వత సభ్యత్వం లేదు. ఇప్పటికే చాలా దేశాలు భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నాయి. ఇలా ప్రపంచ దేశాలనుంచి మద్దతు పెరుగుతుంటే ఒక్క చైనా మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్‌తో పాటు ఆఫ్రికా దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉండాలని మరోసారి స్పష్టం చేసింది. ఈ దేశాల ప్రతినిధులు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత ప్రాతిపదికన ప్రాతినిధ్యం కలిగి ఉండాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. 

Also Read: వణికిస్తున్న బాంబు బెదిరింపులు.. ఎయిర్ లైన్స్‌కి ఎంత నష్టమంటే?

సంస్కరణలు చేయాలి

ఇటీవల ఏ స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ఇలా భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనని చెప్పడం మరోసారి చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా ఐక్యరాజ్య సమతి భద్రతా మండలిలో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని భారత్ ఎప్పటినుంచో వాదనలు వినిపిస్తూనే ఉంది. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ అర్హమైన దేశమని వాదిస్తోంది. భారత్ వాదనను ఇతర అగ్రదేశాలు అంగీకరిస్తున్నాయి.  

Also Read: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..

ప్రస్తుతం ఐదు దేశాలే

ఇందుకోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌లు ఇప్పటికే భారత్‌కు మద్దతుగా నిలిచాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్మర్ కూడా ప్రాతనిధ్యం ఉండాల్సిందేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమతి భద్రతా మండలిలో అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా, బ్రిటన్.. ఈ ఐదు దేశాలు మాత్రమే శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాల సంఖ్యను ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని అగ్రదేశాలు కూడా భావిస్తున్నాయి. కానీ చైనా మాత్రం భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడాన్ని వ్యతిరేకించడం గమనార్హం. 

Also Read: మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?

Also Read: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు