BREAKING: సామాన్యుడికి ఊరట.. పెట్రోల్, డీజిల్‌పై రూ.10 తగ్గింపు.. కారణాలు ఇదే

మిడిల్‌ఈస్ట్‌లో జరుగుతన్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.10 తగ్గించింది.

New Update
Resond behind Excise Duty On Petrol Cut To Rs 3, Diesel To Zero,

Resond behind Excise Duty On Petrol Cut To Rs 3, Diesel To Zero,

మిడిల్‌ఈస్ట్‌లో జరుగుతన్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.10 తగ్గించింది.  వాస్తవానికి పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) గణాంకాల ప్రకారం.. భారతీయ ముడి చమురు బాస్కెట్ ధర ఫిబ్రవరి 2026లో బ్యారెల్‌కు $69.01 ఉంది. కానీ మార్చి 24 నాటికి అది ఏకంగా $123.15కు చేరింది. కేవలం ఒకే నెల వ్యవధిలోనే 78 శాతం పెరిగింది.ఈ క్రమంలోనే ప్రజలపై భారం పడకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు 20 నుంచి 50 శాతం వరకు పెరిగినట్లు పేర్కొన్నారు. ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా, ఐరోపాతో పాటు ఆఫ్రికా దేశాల్లో చమురు ధరలు భారీగా పెరిగాయన్నారు. భారత్‌లో కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అలెర్ట్ అయినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి పడినా సామాన్యుడికి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి రాసలీలలు.. వీడియో వైరల్

దేశీయ వినియోగం కోసం పెట్రోల్, డీజిల్‌పై రూ.10 వరకు ఎక్సైజ్ సుంకం తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించారు. అలాగే దేశీయ లభ్యతను పటిష్టం చేసేలా డీజిల్ ఎగుమతిపై లీటర్‌కు రూ.21.5, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై లీటరుకు రూ.29.5 సుంకాన్ని విధించామని పేర్కొన్నారు. నిత్యావసర ధరల్లో హెచ్చుతగ్గుల నుంచి ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు.  

మొత్తంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా కేంద్ర చర్యలు తీసుకుంటోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  అయితే ఈ నిర్ణయం వల్ల అన్ని రంగాలపై సానుకూల ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలాగే ద్రవ్యోల్బణాన్ని కూడా కంట్రోల్‌లో ఉంచవచ్చని అంటున్నారు. ఇదిలాఉండగా ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 107 ఉండగా.. రూ.97కు చేరింది. ఇక డీజిల్ ధర లీటర్‌కు రూ.95 ఉండగా రూ.85కు తగ్గింది.  

Also Read: ట్రంప్ సంచలన ప్రకటన.. ఇరాన్‌పై దాడులు మరో 10 రోజులు వాయిదా

ఎన్నికల స్టంట్ 

ఇదిలా ఉండగా వచ్చే నెలలో పశ్చిమ బెంగాల, తమిళనాడు, కేరళ, అస్సాంతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల కోసమే కేంద్రం చమురుపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించినట్లు విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.  

Advertisment
తాజా కథనాలు