/rtv/media/media_files/2026/03/06/qatar-2026-03-06-18-14-14.jpg)
Qatar Says if the war continues for another two weeks, the price of crude oil will reach $150 per barrel
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. యుద్ధం ఇంకో రెండు వారాలు ఇలాగే కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర 150 డాలర్లు అవుతుందని వెల్లడించింది. ప్రపంచ దేశాలకు పెను సంక్షోభం పొంచి ఉందని తెలిపింది. మరోవైపు ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. రష్యా మాతో పరోక్షంగా యుద్ధం చేస్తోందని ఆరోపించింది. ఇరాన్‌కు రష్యా పూర్తిగా సహకరిస్తోందని పేర్కొంది. రష్యా నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతోనే ఇరాన్ మా యుద్ధ నౌకలు, విమానాలపై దాడులు చేస్తోందని మండిపడింది. మరోవైపు మా మిత్రపక్షాలనే అమెరికా టార్గెట్ చేసిందని రష్యా ఆరోపిస్తోంది.
Follow Us