/rtv/media/media_files/2025/02/14/trump-modi.jpg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
/rtv/media/media_files/2025/02/14/modi-trump-wishing.jpg)
భారత విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తో కలసి వైట్‌హౌస్ కు చేరుకున్న మోదీ.. ఆ తర్వాత ట్రంప్‌తో భేటీ అయ్యారు.
/rtv/media/media_files/2025/02/14/trump-modi-hug.jpg)
ట్రంప్ తో దాదాపుగా నాలుగు గంటల పాటు ప్రధాని మోదీ చర్చించారు. భారత్ అధిక టారిఫ్‌లు విధిస్తోందంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. ట్రంప్ ఆరోపణలు చేస్తుండగా మోదీ సైలెంట్ అయిపోయారు.
/rtv/media/media_files/2025/02/14/modi-trump.jpg)
అనంతరం భారత్ కు అత్యంత అధునాతన F-35 ఫైటర్ జెట్లను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా ట్రంప్ వెల్లడించారు. ఇకపై ఇండియాకు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలు పెంచుతామని తెలిపారు.
/rtv/media/media_files/2025/02/14/modi-trump-speech.jpg)
మోడీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరుగుతుందని విశ్వసిస్తున్నాం అన్నారు. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే తమ లక్ష్యం అని తెలిపారు.
/rtv/media/media_files/2025/02/14/modi-trump-photos.jpg)
మీటింగ్ అనంతరం మోదీకి ఒక ప్రత్యేక బహుమతిని కూడా అందజేశారు. తాను స్వయంగా రాసిన ‘అవర్ జర్నీ టుగెదర్’ అనే పుస్తకాన్ని ట్రంప్ కానుకగా ఇచ్చారు.
/rtv/media/media_files/2025/02/14/modi-trump-new-photos.jpg)
అలాగే మోదీకి ఆతిధ్యమివ్వడం గురించి ట్రంప్ గొప్పగా చెప్పారు. భారత ప్రధానిని తమ గెస్ట్ గా పిలవడం చాలా గౌరవంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు.
/rtv/media/media_files/2025/02/14/trump-musk.jpg)
ఇక అక్కడే ట్రంప్ తో పాటూ ఎలాన్ మస్క్, ఉపాధ్యక్షుడు తదితరులతో ప్రధాని సమావేశమయ్యారు.