USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్

అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక విమానం, హెలికాఫ్టర్ ఢీ కొన్నాయి. దీంతో రెండూ పక్కనే ఉన్న నదిలో కూలిపోయాయి. విమానంలో 60 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.

author-image
By Manogna alamuru
New Update
crash

Air Plane, Helicopter Crash

వాషింగ్టన్ లో రీగన్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయంలో హెలికాఫ్టర్ ల్యాండ్ అవుతుండగా..పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చిన్న విమానం దానికి అడ్డుగా వచ్చింది. దీంతో రెండూ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో విమానం, హెలికాఫ్టర్ రెండూ ఎయిర్ పోర్ట్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. హెలికాఫ్టర్ లో పైలెట్లు ఇద్దరు ఉండగా..విమానంలో 60 దాకా ప్రయాణికులు, నలుగురు స్టాఫ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  ప్రయాణికుల కోసం నదిలో గాలిస్తున్నారు.

ఒకే సమయంలో ల్యాండ్ అయ్యాయి..

రాత్రి 8.30 గంటల ప్రాంతంలో  పీఎస్ఏ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్యాసెంజర్ వియాన కాన్సాస్ లోని విషిటా ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరింది. ఒక గంట తర్వాత ఇది వాషింగట్ రోనాల్డ్ రీగన్ ఎయర్ పర్ట్ రన్ వే మీద దిగేందుకు సిద్ధమైంది. ఇంతలో అదే సమయానికి ల్యాండింగ్ అవుతున్న రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్‌-60 బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్‌ దీనిని ఢీ కొట్టింది. రెండు ఆకాశంలోనే గుద్దుకున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు పెద్ద శబ్దం వినిపించింది. ఆ తరువాత హెలికాఫ్టర్, విమానం రెండూ ఎయిర్ పోర్ట్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో పడిపోయాయి.  

 

Also Read: Deep Seek: డీప్ సీక్ వెనుక అందమైన అమ్మాయి..టెక్ సంచలన

ప్రమాదం జరిగిన వెంటనే రీగన్ ఎయిర్ పోర్ట్ ను మూసేశారు. అన్ని సేవలను వెంటనే నిలిపేశారు. ప్రమాదంలో ఎంతమంది మరణించారన్నది ఇంకా తెలియలేదని...కానీ కచ్చితంగా చాలా మందే మృతి చెంది ఉంటారని అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ తెలిపారు. హెలికాఫ్టర్, ఫీఎస్ఏ ప్యాసెంజర్ విమానం రెండూ ఒకే సమయంలో ల్యాండ్ అవడానికి ప్రయత్నిండంతోనే ప్రమాదం సభవించిందని ఎయిర్ పోర్ట్ అధికారులు చెబుతున్నారు. అయితే ఏ రెండు విమానాలకు ఒకేసారి ల్యాండ్ అవడానికి అనుమతి ఇవ్వరు. అది కూడా ఒకే ప్రదేశంలో ఇవ్వడానికి అస్సలు ఇవ్వరు. కానీ ఎక్కడ తప్పిదం జరిగిందో తెలియడం లేదని అంటున్నారు. 

Also Read: Parliament Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు..ఈరోజు అఖిలపక్షం సమావేశం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pak: భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్‌ సైన్యాధిపతి!

పాక్‌ నేతలు భారత్‌ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.పాక్‌ సైన్యాధిపతి ఆసిం మునీర్‌ మరోసారి భారత్‌ పై అక్కసు వెళ్లగక్కారు.రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన ఆయన..అన్ని అంశాల్లో హిందూ,ముస్లింలు వేర్వేరు అని వ్యాఖ్యానించారు.

New Update
 Pakistan army chief Asim Munir

Pakistan army chief Asim Munir

పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్‌ పాత్ర ఉందని పేర్కొన్న భారత్‌..దాయాది దేశం పై చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పాక్‌ నేతలు భారత్‌ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.పాక్‌ సైన్యాధిపతి ఆసిం మునీర్‌ మరోసారి భారత్‌ పై అక్కసు వెళ్లగక్కారు.

Also Read: Russia-Ukrain-Putin: ఉక్రెయిన్‌ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!

రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన ఆయన..అన్ని అంశాల్లో హిందూ,ముస్లింలు వేర్వేరు అని వ్యాఖ్యానించారు.మతంఆచారాలు,సంప్రదాయాలు, ఆలోచనలు,ఆకాంక్షల్లో హిందూ ,ముస్లింలు వేర్వేరు.వీటి ఆధారంగానే రెండు దేశాలు ఉండాలనే భావన ఏర్పడింది.పాకిస్తాన్‌ ఏర్పాటుకు పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు.

Also Read: BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

వాటిని ఎలా కాపాడుకోవాలో మనకు తెలుసు అని పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ పేర్కొన్నారు. ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పాక్‌ మిలిటరీ అకాడమీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అంతకు ముందు ప్రవాస పాకిస్థానీల తొలి సదస్సులోనూ మునీర్‌ ఇదే విధంగా మాట్లాడారు.

మనది ఒక దేశం కాదని,రెండు దేశాలన్నారు.కశ్మీర్‌ తమ జీవనాడి లాంటిదని వ్యాఖ్యానిచారు.ఇలా మాట్లాడిన కొన్ని రోజుల్లోనే పహల్గాంలో ముష్కరులు పాశవిక దాడులకు పాల్పడ్డారు.


జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హిందువుల ఊచకోత తర్వాత, భారత్ .. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. సింధూ జల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయడం, పాకిస్తాన్ హైకమిషన్‌లో దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించడం, అట్టారి-వాఘా సరిహద్దును మూసివేయడం వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇవి పాకిస్తాన్‌లో భయాందోళనలను సృష్టించింది. ఏ క్షణమైనా భారత్ తో యుద్దం సంభవించవచ్చనని భావించిన పాక్.. భయపడిపోయి చైనాను ఆశ్రయించి సహాయం కోసం విజ్ఞప్తి చేసింది.

పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ ఇస్లామాబాద్‌లో చైనా రాయబారి జియాంగ్ జెతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు.  ఒకవేళ భారత్ తో యుద్దం సంభవిస్తే సహాయం చేయాలని కోరారు.  అందుకు చైనా కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

మరోవైపు పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ వెల్లడించారు.  భారత్ తమపై ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఉగ్రవాద దాడిపై నిష్పాక్షిక దర్యాప్తుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 

పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్‌ మమ్మల్ని నిందిస్తోంది.ఈ దాడి పై ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు జరిగినట్లు కనిపించడం లేదు. ఒక వేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్‌ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 22న జరిగిన ఈ ఊచకోతలో, 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడిని ఉగ్రవాదులు చంపేశారు.

Also Read:Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Also Read: BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

pak | army | chief | Asim Munir | bharat | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు