/rtv/media/media_files/2026/05/19/pakistan-china-2026-05-19-11-15-40.jpg)
Pakistan’s 2024 nuclear request to China in exchange for Gwadar revealed
పాకిస్తాన్, చైనాల మధ్య జరగబోయే రహస్య వ్యూహాత్మక ఒప్పందానికి సంబంధించిన కీలక విషయాలు బయటపడ్డాయి. అమెరికాకు చెందిన స్వతంత్ర మీడియా సంస్థ 'డ్రాప్ సైట్ న్యూస్' ఈ నివేదికను వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. శత్రుదేశం మొదట అణుదాడి చేసినప్పటికీ, తిరిగి ఎదురుదాడి చేయగల 'ద్వితీయ దాడి సామర్థ్యం' (సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ) కోసం పాకిస్థాన్.. చైనా సాయాన్ని కోరింది. దీనికోసం అణు జలాంతర్గాములను తమకు అప్పగించాలని, దీనికి బదులుగా చైనా నౌకాదళానికి తమ దేశంలోని 'గ్వాదర్ పోర్టు'ను శాశ్వత సైనిక స్థావరంగా మార్చుకునేందుకు పర్మిషన్ ఇస్తామని పాకిస్తాన్ ఆశ చూపింది.
2024లో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నేతృత్వంలో చైనాతో అత్యున్నత స్థాయి సైనిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగానే ఈ ప్రతిపాదన ముందుకొచ్చింది. ఒకవేళ చైనా.. పాకిస్థాన్‌కు అణ్వాయుధ సామర్థ్యమున్న జలాంతర్గాములను అందించి ఉంటే, పాకిస్తాన్ భూమి, గాలి, సముద్రం.. ఈ మూడు మార్గాల ద్వారా అణు దాడులు చేయగల సామర్థ్యం సంపాదించేది. ఇందుకోసం చైనాకు గ్వాదర్ పోర్టు లభిస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ పెట్టిన ఈ రక్షణ షరతు చాలా అసమంజసమైనదిగా చైనా భావించింది. చివరికి ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో ఈ చర్చలు ముందుకు సాగలేదు.
Also Read: వాహనాదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
వాస్తవానికి 1970, 80ల కాలం నుంచే పాక్ అణు కార్యక్రమాలకు చైనా అండగా ఉంటోంది. ఇప్పటిదాకా పాకిస్తాన్‌కు అత్యంత సుసంపన్నమైన యురేనియం, అణ్వాయుధాల నమూనాలు, M-11 బాలిస్టిక్ క్షిపణులను చైనా రహస్యంగా తరలిచింది. అందుకే పాకిస్తాన్ భూమి, గాలి నుంచి అణు దాడులు చేసే సామర్థ్యాన్ని సంపాదించుకుంది. సముద్ర గర్భం నుంచి అణు క్షిపణులను ప్రయోగించడం కోసం పాక్ చాలా కాలంగా ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగానే 2014లో చైనాతో కుదుర్చుకున్న ఎనిమిది హంగోర్- తరగతి జలాంతర్గాముల ఒప్పందంలో మొదటిదైన 'పి.ఎన్.ఎస్. హంగోర్'ను ఈ ఏడాది చైనాలోని సాన్యాలో పాక్ నౌకాదళం సేవల్లోకి తీసుకొచ్చింది.
అయితే ఈ పరిణామాలు అంతర్జాతీయ వేదికపై అమెరికా, చైనా మధ్య పాకిస్తాన్ చూపిస్తున్న ద్వంద్వ దౌత్య నీతిని బయటపెడుతున్నాయి. గత ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వా హయాంలో పాకిస్థాన్ పూర్తిగా చైనా వైపు మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టు కూడా వేగవంతం అయ్యింది. కానీ ప్రస్తుత ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మాత్రం అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నారు. 2024 నాటికి చైనాతో ఓ భారీ రక్షణ ఒప్పందంపై సంతకం చేసేందుకు పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ తన అణు అజెండా నెరవేరకపోవడం వల్ల ఆ ఒప్పందం పెండింగ్‌లోనే ఉండిపోయింది.
Follow Us