/rtv/media/media_files/2026/04/19/pakistani-2026-04-19-13-30-23.jpg)
పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్‌లో సాగిస్తున్న అరాచకాలు, అణచివేత చర్యలు మరోసారి బట్టబయలయ్యాయి. శాంతి మంత్రం పఠిస్తూ ప్రపంచ దేశాల ముందు మంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్న పాకిస్తాన్, తన సొంత భూభాగమైన బలూచిస్తాన్‌లో మాత్రం 'నరమేధాన్ని' కొనసాగిస్తోందని శ్రీలంక గార్డియన్ వెలువరించిన తాజా నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. పాకిస్తాన్ ఒకవైపు అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి రాయబారిగా నటిస్తూ.. మరోవైపు సొంత దేశ ప్రజలపై క్రూరంగా ప్రదర్శిస్తోందని శ్రీలంక గార్డియన్ విశ్లేషించింది.
రాజ్యాంగం లేని పాలన
బలూచిస్తాన్‌లో మానవ హక్కులు అనే పదానికి అర్థమే లేదని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. బలుచిస్తాన్ పౌరుల పట్ట పాక్ ప్రభుత్వం పాశవిక పాలన అనుసరిస్తోంది. ముఖ్యంగా యూత్‌ని టార్గెట్‌గా చేసుకొని కిడ్నాప్ చేసి వారిని చంపేస్తున్నారు. ఇది అక్కడి ప్రభుత్వ అధికారికారుల డ్యూటీ మారిపోయింది. కాలేజీకి వెళ్లిన విద్యార్థులు, సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర ఆగిన ప్రయాణికులు సడెన్‌గా మాయమవుతున్నారు. కొన్ని రోజుల తర్వాత వారి మృతదేహాలు చిత్రహింసల ఆనవాళ్లతో నిర్మానుష్య ప్రాంతాల్లో లభ్యమవుతున్నాయి. దీనినే పాక్ సైన్యం ‘కిల్ అండ్ డంప్’ పాలసీగా అమలు చేస్తోందని నివేదిక పేర్కొంది.
భయంకరమైన గణాంకాలు
పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక గణాంకాలే అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 2025లో 1,355 కిడ్నాప్‌లు, 225 కస్టడీ మరణాలు నమోదయ్యాయి. 2026 జనవరిలో 82 మంది, ఫిబ్రవరిలో 109 మంది అదృశ్యమయ్యారు. ఈ నెంబర్లు కేవలం కాగితాల మీద ఉన్నవి మాత్రమే, వాస్తవానికి బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వనరుల దోపిడీ.. ప్రజల అణచివేత
1948లో పాకిస్తాన్‌లో విలీనం అయినప్పటి నుండి బలూచిస్తాన్‌ను కేవలం ఒక ‘వనరుల ప్రాంతం’గానే చూస్తున్నారే తప్ప, అక్కడి ప్రజల అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని నివేదిక విమర్శించింది. పాకిస్తానీ సైన్యం, ఐఎస్ఐ (ISI) గూఢచార సంస్థ కలిసి ప్రజా సమ్మతికి బదులుగా బెదిరించి, భయపెట్టే వ్యవస్థను నడుపుతున్నాయి. తమ కొడుకులు, భర్తలు ఎక్కడున్నారో తెలియక వేలాది మంది బలూచ్ మహిళలు ఏళ్ల తరబడి రోడ్ల మీద నిరసనలు తెలుపుతున్నారు. కోర్టు మెట్లు ఎక్కినా, రహదారులను దిగ్బంధించినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు.
Follow Us