Earthquake: భూ ప్రళయం.. 1600 దాటిన మరణాలు

మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో వచ్చిన భూకంపాలు పెను విధ్వంసం సృష్టించింది. ఇప్పటిదాకా మయన్మార్‌లో సంభవించిన భూకంపం ధాటికి 1644 మంది మృతి చెందినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం వెల్లడించింది. మరో 2400 మంది గాయపడినట్లు పేర్కొంది.

New Update
Earthquake

Earthquake

Earthquake: మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో వచ్చిన భూకంపాలు పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా మయన్మార్‌లో భూకంపం ధాటికి 1644 మంది మృతి చెందినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం వెల్లడించింది. మరో 2400 మంది గాయపడినట్లు పేర్కొంది. దీని ప్రభావానికి చాలా ఇళ్లు కూలిపోయాయని.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Also Read: మరో మయన్మార్‌ కానున్న భారత్.. త్వరలో ఇండియాలో విధ్వంసం!

మరోవైపు మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాల ముందుకొస్తున్నాయి.ఇప్పటికే భారత్‌.. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, టెంట్లు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసింది. అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా సాయం చేస్తామని ప్రకటించాయి. అలాగే మయన్మార్, థాయ్‌లాండ్‌కు సహాయక సామగ్రిని  పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియోగుటెరస్ తెలిపారు.  

Also Read: జేఈఈ మెయిన్స్‌ రెండో విడత పరీక్షలు వాయిదా..! కారణం ఏంటంటే?

ఇదిలాఉండగా..

శనివారం మధ్యాహ్నం 2.50 గంటలకు 4.7 తీవ్రతతో మయన్మార్‌లో మరోసారి భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. యూనైటెడ్ స్టేట్స్‌ జియోలాజికల్ సర్వే ఈ భూకంప తీవ్రతను 5.1గా పేర్కొంది. మయన్మార్ రాజధాని నేపిడాకి సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. 

Also Read: బెట్టింగ్ వలలో చిక్కడానికి మూలం అతడే.. నటి మాధవిలత సంచలన ఆరోపణ

Also Read: ఆస్పత్రిలో పురిటినొప్పులతో ఉండగా భూకంపం.. చివరికి

Advertisment
Advertisment
Advertisment