/rtv/media/media_files/2025/03/08/TIwZffU2b484hPIiInvc.jpg)
Open AI CEO Sam Altman
ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు పదేళ్లపాటు లైంగికంగా వేధించాడని అతనిపై తన సోదరి చేసిన ఆరోపణలకు తీవ్రంగా ఖండించారు. ఇవ్వన్నీ తప్పుడు వాదనలు అంటూ తేల్చిచెప్పారు. ఆమె తనపై చేసిన ఆరోపణలు పరువుకు భంగం కలిగించడంతో పాటు ఎంతో మానసిక వేదనకు గురిచేశాయని చెప్పారు. దీంతో తన సోదరిపై పరువు నష్టం దావా వేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. శామ్ ఆల్ట్‌మన్ సోదరి అన్ ఆల్ట్ కీలక ఆరోపణలు చేశారు.
Also Read: లిప్‌స్టిక్‌తోపాటు కత్తీ, కారం పొడి తీసుకెళ్లండి.. మంత్రి కీలక వ్యాఖ్యలు
1990 చివరి నుంచి 2000 వరకు మిస్సౌరీలో ఉన్నప్పుడు శామ్ ఆల్ట్‌మన్ తనను లైంగికంగా వేధించాడని ఈ ఏడాది జనవరిలో ఆరోపణలు చేశారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే లైంగిక వేధింపులు మొదలయ్యాయని.. దాదాపు పదేళ్ల పాటు ఇవి కొనసాగినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో శామ్ ఆల్ట్‌మన్ మేజర్ అయినప్పటికీ.. తాను మాత్రం మైనర్ అని చెప్పారు. దీంతో ఆమె కోర్టులో దావా వేశారు.
Also Read: ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం.. లెఫ్టినెంట్ జనరల్ భార్య ఆసుపత్రిపాలు!
అయితే తనన లైంగికంగా వేధింపులకు గురిచేశాడని అన్ ఆల్ట్‌మన్ చేసిన ఆరోపణలను శామ్ ఆల్ట్‌మన్ ఖండించారు. చివరికీ కోర్టును ఆశ్రయించారు. తనపై సోదరి చేసిన ఆరోపణలు తన ప్రతిష్ఠను దిగజార్చాయని చెప్పుకున్నాడు. అలాగే తనను ఎంతో మానసిక వేదనకు గురిచేశాయంటూ పేర్కొన్నారు. తన నుంచి ఆర్థిక సాయాన్ని పొందాలనే కుట్రతోనే తనపై కోర్టులో దావా వేసిందని చెప్పారు. దీంతో ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అయితే శామ్ ఆల్ట్‌మన్ తన సోదరిని లైంగికంగా వేధించాడనే వార్తలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఆయన దీనిపై స్పందించి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Also Read: ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం.. లెఫ్టినెంట్ జనరల్ భార్య ఆసుపత్రిపాలు!
Also Read: పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!