Nuclear Attack: సంచలన అప్‌డేట్.. ఇరాన్‌పై అణుబాంబులు వేసేందుకు సిద్ధమవుతున్న అమెరికా

అమెరికా, ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహ్మద్‌ సఫా చేసిన సంచలన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టెహ్రాన్‌ నగరంపై అణుబాంబులు వేసేందుకు అమెరికా సిద్ధమవుతోందని అన్నారు.

New Update
Nuclear attack on Iran? UN diplomat resigns saying 'giving up my career to leak possible nuke missile strike plan'

Nuclear attack on Iran? UN diplomat resigns saying 'giving up my career to leak possible nuke missile strike plan'


అమెరికా, ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహ్మద్‌ సఫా చేసిన సంచలన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టెహ్రాన్‌ నగరంపై అణుబాంబులు వేసేందుకు అమెరికా సిద్ధమవుతోందని అన్నారు. ఈ విధ్వంసానికి సాక్ష్యంగా ఉండలేక తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఈ అణ్వాయుధ దాడుల వ్యూహానికి ఐక్యరాజ్యసమితిలోని కొందరు కీలక నేతలు కూడా సపోర్ట్ చేస్తున్నట్లు ఆరోపించారు. ప్రపంచ శాంతిని కాపాడాల్సిన సంస్థలే యుద్ధానికి సహకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. అమెరికా కుట్రలను ప్రజలే తిప్పికొట్టాలంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు.

Also Read: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు, ఆయుధ నిల్వలు ధ్వంసం.. వీడియో షేర్ చేసిన ట్రంప్

అయితే ఈ వ్యూహాత్మక కోణంలో చూస్తే అమెరికా తనపై నిందను వేసుకోకుండా ఇజ్రాయెల్‌ను పావుగా వాడుకోబోతున్నట్లు సమాచారం. అధ్యక్షుడు ట్రంప్‌ నేతృత్వంలో ఇజ్రాయెల్‌ ద్వారా ఇరాన్‌పై అణుబాంబు ప్రయోగించేలా ప్లాన్ వేస్తున్నట్లు సఫా పేర్కొన్నారు. "తన చేతికి మట్టి అంటకుండా" పని పూర్తి చేయాలనే అమెరికా భావిస్తోందని.. ఇది పశ్చిమాసియాలో పెను రాజకీయ మార్పులకు దారితీయనుందన్నారు. మరోవైపు ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలనే టార్గెట్‌తో ఈ భారీ సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

Also Read: కువైట్‌కు మరో ఎదురుదెబ్బ.. చమురు ట్యాంకర్‌పై విరుచుకుపడ్డ ఇరాన్‌

ఒకవేళ నిజంగానే అమెరికా.. ఇరాన్‌పై అణుబాంబులు వేస్తే ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధంగా ఉండదు. మిడిల్‌ఈస్ట్‌లో చమురు సరఫరా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోతాయి. అలాగే రష్యా, చైనా కూడా ఈ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హర్మూజ్ జలసంధి అంతరాయం నెలకొన్న నేపథ్యంలో ఈ అణుబాంబు దాడుల వార్తలు ప్రపంచ మార్కెట్‌లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ యుద్ధాన్ని ఆపేందుకు తక్షిణమే అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

అమెరికా వద్ద ఎన్ని అణుబాంబులు ఉన్నాయి ? 

 2025-26 నాటి అంచనాల ప్రకారం అమెరికా వద్ద సుమారు 5,042 నుండి 5,177 వరకు అణు వార్‌హెడ్లు (Warheads) ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో సుమారు 3700 అణ్వాయుధాలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో దాదాపు 1700 అణ్వాయుధాలను మిస్సైల్స్, సబ్‌మెరైన్స్, బాంబర్ విమానాల్లో ప్రయోగించేందుకు రెడీగా ఉంచారు. ఇక  మిగిలిన వార్‌హెడ్లు రిజర్వ్‌లో ఉన్నాయి లేదా కాలం చెల్లినవి కావడంతో వాటిని నిర్వీర్యం చేసే ప్రక్రియ జరుగుతున్నట్లు సమాచారం.

ఇదిలాఉండగా ప్రపంచ చరిత్రలో యుద్ధ సమయంలో అణ్వాయుధాలను ఉపయోగించిన ఏకైక దేశంగా అమెరికా నిలిచింది. రెండవ ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్‌పై అమెరికా రెండు అణుబాంబులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. 

హిరోషిమా: ఆగస్టు 6, 1945న 'లిటిల్ బాయ్' అనే పేరుగల యురేనియం బాంబును ఈ సిటీపై వేశారు. ఈ ఘటనలో దాదాపు 1,40,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

నాగసాకి: 3 రోజుల తర్వాత.. అంటే ఆగస్టు 9, 1945న 'ఫ్యాట్ మ్యాన్' అనే ప్లూటోనియం బాంబును ఈ నగరంపై వేయగా సుమారు 74,000 మంది మృతి చెందారు. 

Advertisment
తాజా కథనాలు