Kim jong Un: యుద్ధంలోకి ఉత్తర కొరియా ఎంట్రీ.. అమెరికాకు కిమ్ వార్నింగ్

అమెరికా, దక్షిణ కొరియా కలిసి నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా స్పందించింది. ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతున్న క్రమంలో  ఈ విన్యాసాలు తమపై దాడులు చేసేందుకు జరుగుతున్న ముందస్తు సన్నాహాలేనంటూ ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోపిస్తున్నారు.

New Update
Kim jong Un

Kim jong Un

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ ఆ దేశ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టాడు. మొజ్తాబాకు ఈ పదవి అప్పగించడాన్ని ఉత్తర కొరియా సపోర్ట్ చేసింది. ఇరాన్ ప్రజల నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని చెప్పింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో అమెరికా శాంతి లేకుండా చేస్తోందని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ మండిపడింది. 

ఇరాన్‌ ప్రభుత్వాన్ని మార్చి, తమకు అనుకూలైన ప్రభుత్వాన్ని తీసుకురావాలని యత్నిస్తున్న ట్రంప్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వేరే దేశంలోని రాజకీయ వ్యవస్థలో జోక్యం చేసుకోని.. అక్కడి ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీయడం దారుణమని విమర్శలు చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ కుట్రలను ప్రపంచ దేశాలు తిరస్కరించాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే రష్యా, చైనా కూడా కొత్త సుప్రీం లీడర్‌గా నియామకం అయిన మొజ్తబాకు సపోర్ట్ చేశాయి. తాజాగా ఉత్తర కొరియా కూడా మద్దతు తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: పశ్చిమాసియా యుద్ధం.. భారత్‌లో మూతబడుతున్న యూరియా ప్లాంట్లు

ఇదిలాఉండగా ప్రస్తుతం అమెరికా, దక్షిణ కొరియా కలిసి నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా స్పందించింది. ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతున్న క్రమంలో  ఈ విన్యాసాలు తమపై దాడులు చేసేందుకు జరుగుతున్న ముందస్తు సన్నాహాలేనంటూ ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోపిస్తున్నారు. అమెరికా ఇలాగే దూకుడు పెంచితే భయంకరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 

మరోవైపు తాజాగా ఉత్తర కొరియా కూడా తమ సైనిక శక్తిని ప్రదర్శించింది.  'చో హ్యోన్' అనే భారీ యుద్ధ నౌక నుంచి క్రూయిజ్ మిస్సైల్స్‌ను పరీక్షించింది. కిమ్ జోంగ్ ఉన్ తన కూతురు జు ఏతో కలిసి స్వయంగా ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. తమ నౌకాదళాన్ని అణ్వాయుధాలతో సన్నద్ధం చేసే ప్రక్రియలో ఇది కీలక అడుగని ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ క్రూయిజ్‌ మిస్సైల్స్‌ను సముద్రం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు. 3 గంటల పాటు ఏకధాటిగా లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం వీటికి ఉంటుంది. సౌత్ కొరియా, అమెరికా సైనిక విన్యాసాలు చేపట్టిన నేపథ్యంలోనే ఉత్తర కొరియా కూడా ఆ రెండు దేశాలకు హెచ్చరికగా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తన  బలాన్ని ప్రపంచ దేశాలకు చూపిస్తోంది. 

Also Read: దేశంలో ఇంధన సంక్షోభం.. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం !

ఉత్తర కొరియాకు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సైనిక సామర్థ్యం ఉంది. ఈ దేశంలో 50-100 న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నుంచి అమెరికాను నేరుగా టార్గెట్ చేయగల  Hwasong-18 అనే ఇంటర్ కాంటినెంటర్ బాలిస్టిక్ మిస్సైల్‌ కూడా వాళ్ల దగ్గర ఉంది. అలాగే రాడార్లకు దొరకని హైపర్ సోనిక్ మిస్సైల్స్ కూడా ఉన్నాయి. ఉత్తర కొరియాకు చైనా, రష్యా మద్దతిస్తు్న్న సంగతి తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు