/rtv/media/media_files/2025/03/19/G5oupHHO2eDf6XdHAzKo.jpg)
New Zealand PM
New Zealand PM : న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్‌భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు సరదాగా బ్యాటు పట్టారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తో కలిసి ఢిల్లీ లో స్థానిక పిల్లలతో క్రికెట్ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను క్రిస్టఫర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఇరు దేశాలను ఏకం చేయడంలో క్రికెట్‌ను మించినది లేదంటూ క్రిస్టోఫర్ లక్సన్ ట్వీట్ చేశారు. తాను క్రికెట్ ఆడిన ఫొటోలను పంచుకున్నారు.
Also Read: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!
కాగా, తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను న్యూజిలాండ్ ప్రధాని కలిశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ , క్రిస్టఫర్ లక్సన్ సోమవారం దిల్లీలో విస్తృత స్థాయి చర్చలు కూడా జరిపారు.
New Zealand Prime Minister Plays Cricket
అంతకు ముందు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ న్యూఢిల్లీలోని BAPS స్వామినారాయణ అక్షరధామ్‌ను సందర్శించారు.. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.. క్రిస్టోఫర్ లక్సన్ తోపాటు ప్రభుత్వ అధికారులు, మంత్రులు, వ్యాపారవేత్తలు, న్యూజిలాండ్ నుండి వచ్చిన కమ్యూనిటీ ప్రతినిధులు సహా 110 మంది సభ్యుల ప్రతినిధి బృందం స్వామినారాయణ అక్షరధామ్‌ను సందర్శించారు. ప్రధాని లక్సన్, ఆయన ప్రతినిధి బృందం BAPS మందిర్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ముగ్దులయ్యారు. ముందుగా వారికి BAPS స్వామినారాయణ అక్షరధామ్ పండితులు ప్రత్యేక స్వాగతం పలికారు..
భారతదేశం గొప్ప వారసత్వం, భక్తి – విలువలను ప్రతిబింబించేలా రూపొందించిన BAPS స్వామినారాయణ అక్షరధామ్ ఆలయ విశిష్టతలను వారంతా అడిగితెలుసుకున్నారు. గౌరవ సూచకంగా, ప్రధాన మంత్రి లక్సన్ స్వామినారాయణ అక్షరధామ్ మందిర్‌లో పూలను సమర్పించారు. ఈ పర్యటన సాంస్కృతిక జ్ఞాపికల మార్పిడి – రెండు (న్యూజిలాండ్ – భారతదేశం) సంస్కృతుల మధ్య లోతైన సహకారాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందని.. లక్సన్ పేర్కొన్నారు.
Nothing unites New Zealand and India more than our shared love of cricket. pic.twitter.com/osnqmdgIu7
— Christopher Luxon (@chrisluxonmp) March 19, 2025
Prime Minister of New Zealand Christopher Luxon, during his visit to Delhi, shared pictures of him and former New Zealand international cricketer Ross Taylor playing cricket with children in Delhi. pic.twitter.com/pZc4kD7x5C
— ANI (@ANI) March 19, 2025