Happy New Year: 2025కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన తొలి దేశం ఇదే.. వీడియో వైరల్

న్యూజిలాండ్‌లో తొలి న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం అయ్యాయి. 2025 సంవత్సరానికి వెల్‌కమ్ చెబుతూ ఆక్లాండ్‌ వాసులు న్యూఇయర్‌ వేడుకల్ని ప్రారంభించారు. బాణాసంచా పేల్చుతూ సంబురాలు జరుపుకున్నారు. అమెరికన్ సమోవా, బేకర్ ద్వీపాలు చివరిగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటాయి.

New Update
HAPPY NEW YEAR 2025

HAPPY NEW YEAR 2025

న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం అయ్యాయి. 2025 సంవత్సరానికి వెల్‌కమ్ చెబుతూ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ వాసులు న్యూఇయర్‌ వేడుకల్ని ప్రారంభించారు. బాణాసంచా పేల్చుతూ ఆక్లాండ్ వాసులు సంబురాలు జరుపుకున్నారు. దీంతో అక్కడ బాణాసంచా షో చూసేందుకు టూరిస్టులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ఇది కూడా చూడండి: పోలీస్‌ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి

2025లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్

భారత్‌ కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్‌ ఆక్లాండ్ వాసులు 2025లోకి ఎంటరయ్యారు. కాగా ప్రపంచంలో తొలిసారిగా కొత్త ఏడాదిలోకి అడుగుకు పెట్టే నగరం ఆక్లాండ్‌. ఇక అమెరికన్ సమోవా, బేకర్ ద్వీపాలు చివరిగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటాయి. ఇవి బుధవారం ఉదయం 6.00 గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి. 

చుక్కల ముగ్గులు

 ఇది కూడా చూడండి: మజ్జిగలో కొన్ని కలిపి తాగితే వ్యాధులు మాయం

ఇదిలా ఉంటే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు చాలా మంది తమ ఇంటిని చాలా అందంగా అలంకరించుకుంటారు. ముగ్గులు, లైట్ సెట్టింగులతో ఎంతో అంగరంగ వైభవంగా చక్కదిద్దుతారు. ఇళ్లలను రకరకాల పువ్వులు, ముగ్గులతో అలంకరణ చేస్తారు. ముఖ్యంగా రకరకాల రంగులతో వాకిలిని అందంగా చేస్తారు. న్యూ ఇయర్ విషెష్ తెలియజేస్తూ.. చుక్కల ముగ్గులు వేస్తుంటారు. ముగ్గుల మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ 2025 వచ్చేలా ట్రై చేస్తారు.

కొందరు చుక్కల ముగ్గులు వేస్తే మరికొందరు గీతల ముగ్గులు, డిజైన్లతో అందంగా వాకిలిని తీర్చిదిద్దుతారు. అయితే కొందరికి ముగ్గులు వేయడం రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. అందులోనూ రంగులు, ముగ్గు పిండితో అసలు వేయలేరు. ఇలాంటి వారు పువ్వలతో కూడా ముగ్గులు వేయవచ్చు. మీకు నచ్చిన పువ్వులను ముగ్గుల మధ్యలో వేసి, వాటిపై దీపాలు పెట్టిన కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. 

new year fl

పిండితో ముగ్గులు వేయడం రానివారు.. అతి సులభంగా, కేవలం పువ్వులతోనే ముగ్గులు వేయొచ్చు. దీంతో ఎంతో ఆనందంగా హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకోవచ్చు. మరి మీరు ఓ సారి ట్రై చేస్తే పోలే.. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు