/rtv/media/media_files/2025/03/12/ERlMbZVxvvz4DqUkQpvK.jpg)
HIV Injection
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రమాదకరమైన వ్యాధుల్లో హెచ్‌ఐవీ ఒకటి. ఇప్పటికీ కోట్లాదిమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మాత్రలు, ఇంజెక్షన్‌లతోనే కాలం వెల్లదీస్తున్నారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. హెచ్‌ఐవీని నివారించేందుకు తమ క్లినికల్ ట్రయల్స్‌లో ఓ ఇంజెక్షన్ విజయవంతమైందని చెప్పారు. ఈ ఇంజెక్షన్ సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్‌లో ఏరులై పారిన నెత్తురు!
ప్రస్తుతం హెచ్‌ఐవీ బాధితులు ప్రతీరోజూ మాత్రలు వేసుకుంటారు. ప్రతినెలా ఇంజెక్షన్లు తీసుకుంటారు. కానీ తాజాగా తయారుచేసిన ఇంజెక్షన్‌ను ఏడాదికి ఒకసారి ఇస్తే సరిపోతుంది. క్లినికల్ ట్రయల్స్‌లో ఇది విజయవంతమైంది. లెనాకాపావిర్ అనే ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ హెచ్‌ఐవీని నివారణకు సురక్షితమైనది పరిశోధకులు గుర్తించారు. హెచ్‌ఐవీ సోకినవారికి ఈ ఇంజెక్షన్ చేస్తే.. ఇది 56 వారాల పాటు ఉంటుందని పరిశోధనలో తేలింది.
Also Read: ఆన్‌లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష!
క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా.. 40 మంది హెచ్‌ఐవీ రహిత వ్యక్తులకు లెనాకాపావిర్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్లలో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్ రాలేవు. 56 వారాల తర్వాత కూడా వాళ్ల శరీరంలో ఈ ఇంజెక్షన్ ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. ప్రతిరోజూ మాత్రలు, నెల రోజులొకకసారి ఇంజెక్షన్ తీసుకోవడం చాలామందికి కష్టతరంగా ఉంటుంది. కానీ ఈ కొత్త ఇంజెక్షన్‌ను ఏడాదికి ఓసారి తీసుకుంటే హెచ్‌ఐవీని నివారించవంచని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనిపై మరింత పరిశోధనలు జరగాల్సి ఉంది. 2023 డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 3.9 కోట్ల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారు. వీళ్లలో 65 శాతం మంది ఆఫ్రికన్ ప్రాంతంలోనే ఉంటున్నారు.
Also Read: మరోసారి విషం చిమ్మిన పాకిస్థాన్.. ట్రైన్ హైజాక్‌కు భారత్ సాయం చేసిందని ఆరోపణలు