/rtv/media/media_files/2026/04/10/netanyahu-slams-spain-2026-04-10-21-38-40.jpg)
Netanyahu Slams Spain, Orders Tough Action Over Allegations Against IDF
స్పెయిన్‌పై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సీరియస్ అయ్యారు. ఆ దేశంపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ సైన్యంపై స్పెయిన్ నిందలు వేస్తోందని ఆయన ఆరోపించారు. తమ దేశాన్ని విమర్శిస్తే మౌనంగా ఉండమంటూ తేల్చిచెప్పారు. కిర్యత్ గాట్‌లోని కో ఆర్డినేషన్ సెంటర్ నుంచి స్పెయిన్ ప్రతినిధులను వెంటనే తొలగించాలంటూ ఆదేశించారు. అంతేకాదు ఉగ్రవాద ప్రభుత్వాలకు స్పెయిన్ సపోర్ట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: టన్నుల కొద్దీ బంగారం కొంటున్న బ్యాంకులు.. ఎందుకో తెలుసా?
ఇజ్రాయెల్‌ను విమర్శించే వాళ్లతో తమకు పని లేదని నెతన్యాహు విమర్శించారు. స్పెయిన్ శత్రుత్వాన్ని సహించేది లేదన్నారు. కానీ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అలాగే పాలస్తీనాను స్పెయిన్ స్వతంత్ర దేశంగా గుర్తించడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ స్పెయిన్ చేసిన వ్యాఖ్యలపై ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతిన్నాయి.
ఇదిలాఉండగా అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. కానీ ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. కేవలం పది నిమిషాల్లోనే 100 లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. తమ దేశంలో రెండు పట్టణాలపై ఇజ్రాయెల్ దళాలు వైమానికి దాడులు చేశాయని.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని లెబనాన్ ఆరోపిస్తోంది. హెజ్‌బొల్లా కూడా ప్రతీకార దాడులకు దిగినట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌లోని మిస్గావ్ ఆమ్ ప్రాంతంలో దాడులు చేసినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది.
Follow Us