/rtv/media/media_files/2025/04/01/qtfK4pMYRmMQ3nkaZ55f.jpg)
Sunitha Williams
అంతర్జాతీయ అంతరిక్ష క్షేత్రం ఐఎస్ఎస్ లో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు టెక్నికల్ ప్రబ్లెమ్స్ వల్ల అక్కడే ఉండిపోయారు. ఈ మధ్యనే మార్చి 19న వారు స్సేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ లో భూమి పైకి అడుగుపెట్టారు. తొమ్మది నెలలు వ్యోమగాములు ఇద్దరూ అంతరిక్షంలోనే ఉండిపోవడం వలన భూమి మీద అలవాటు తప్పినట్టయింది. అందుకే వారు భూమి మీదకు రాగానే హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. 12 రోజులుగా అక్కడే చికిత్స పొందుతూ నార్మల్ అవడానికి ప్రయత్నించారు. ఆస్ట్రోనాట్స్ ఇద్దరూ ఈ రోజు బాహ్య ప్రపంచంలోకి రావడమే కాకుండా మీడియాతో కూడా మాట్లాడారు.
అవకాశం వస్తే మళ్ళీ వెళతా..
ఇప్పుడు తాను బాగానే ఉన్నానని చెప్పారు సునీతా విలియమ్స్. మామూలుగా నడవగలుగుతున్నామని, అన్ని పనులూ సక్రమంగా చేయగలుగుతున్నామని చెప్పారు. అవకాశం వస్తే మళ్ళీ స్టార్ లైనర్ లో ఐఎస్ఎస్ కు వెళతామని అన్నారు సునీతా విలియమ్స్. అది చాలా సామర్ధ్యం గల స్పేష్ షిప్ అని...అయితే కొన్ని టెక్సికల్ ఇష్యూ ఉన్నాయని, వాటిని సరి చేస్తే బావుంటుందని చెప్పుకొచ్చారు. ఇక తమ మిషన్ సక్సెస్ అయినందుకు నాసాకు కృతజ్ఞతలు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న మిషన్ కంట్రోల్ బృందాలు తాము తిరిగి భూమిపైకి రావడంలో, పునరావాసం, కొత్త సవాళ్లకు సిద్ధకావడానికి ఎంతో సహాయం చేశాయన్నారు. తాము భూమి మీదకు వచ్చాక ఇప్పటి వరకు 3 మైళ్ళు పరుగెత్తానని సునీతా తెలిపారు. తాము మామూలు స్థితికి రావడానికి శిక్షకులు చాలా సహాయపడుతున్నారని చెప్పారు. ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు తాము ఎన్నో ప్రయోగాలు చేపట్టామని బుచ్ విలోమర్ చెప్పారు. ఐఎస్‌ఎస్‌లో ఉన్నప్పుడు తన ఆరోగ్యం గురించి చాలా మంది ఆందోళనకు గురైన విషయం తనకు తెలునన్నారు. అయితే తాము ఒక పెద్ద టీమ్ ప్రయత్నంలో భాగమై ఉన్నట్లు తెలిపారు. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చాక శరీరంలో కొన్ని మార్పులు ఉంటాయని, అందుకు తగ్గట్లు కొన్ని సర్దుబాట్లు అవసరమన్నారు.
LIVE: @NASA_Astronauts @AstroHague, Suni Williams, and Butch Wilmore are talking about their #Crew9 mission to the @Space_Station, which returned to Earth on Tuesday, March 18. https://t.co/xoVuCu6C16
— NASA (@NASA) March 31, 2025
today-latest-news-in-telugu | nasa | sunitha-williams
Also Read: IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్