/rtv/media/media_files/2025/03/15/rDRFYleweLtuevvCJJ44.jpg)
Sunitha Williams, Buch Wilmore
సునీతా విలియమ్స్ భూమిమీద కాలుమోపే దిశగా అడుగులు పడ్డాయి. నాసా, స్పేస్ ఎక్స్ కలిపి అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను తీసుకువచ్చేందుకు చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ఈరోజు ఆకాశంలోకి దూసుకెళ్లింది. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఇది బయలు దేరింది. ఇందులో నలుగురు వ్యోమగాములను స్పేస్ లోకి పంపించింది నాసా. ఇప్పుడు వెళ్ళిన వారు అక్కడ ఉండి..తొమ్మది నెలలుగా అంతరిక్షంలో ఉండిపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లను భూమి మీదకు తీసుకువస్తారు. డ్రాగన్ క్యాప్సుల్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన వారిలో అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ వ్యోమగాములు ఉన్నారు. నిజానికి నాసా-స్పేస్ ఎక్స్‌లు తాజాగా క్రూ-10 మిషన్ మూడు రోజుల కిందటే స్పేస్ లోకి వెళ్ళాలి. అయితే టెక్నికల్ ప్రాబ్లెమ్స్ వచ్చి ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఈరోజుకి అవన్నీ క్లియర్ అవడంతో ఫాల్కన్ 9 నింగిలోకి ఎగిసింది.
తొమ్మిది నెలలుగా అక్కడే..
గత జూన్ 5న భారత సంతతి ఆస్ట్రోనాట్ అయిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. వీరిని తీసుకెళ్లిన స్టార్‌లైనర్ ప్రొపల్షన్‌తో సమస్యలు తలెత్తడంతో వారు ఎనిమిది నెలలుగా అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు ఆరోగ్యం మీద అనేక అనుమానాలు తలెత్తాయి. వారు చనిపోతారని ఆందోళనలు రేగాయి. అయితే నాసా వీటన్నిటికీ ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంది. వ్యోమగాముల ఆరోగ్యం మీ శ్రద్ధ తీసుకుంటున్నామని...ఎపటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెబుతూనే ఉంది. వ్యోమగాముల ఫోటోలను నాసా పోస్ట్ చేస్తూనే ఉంది. అంతరిక్షం నుంచే సునీతా, బుచ్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడే క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. అక్కడి నుంచి మారథాన్ చేశారు. ఇలా రకరకాలుగా తమలో ఉత్సాహాన్ని నింపుకుంటూ ప్రతీరోజూ భూమి మీదకు వస్తామనే ఆశతో ఇద్దరు వ్యోమగాములు తొమ్మిది నెలలు గడిపారు.
Also Read: AP: తెలంగాణపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు..జన్మస్థలమంటూ..