/rtv/media/media_files/2026/03/04/saudi-aramco-2026-03-04-17-41-18.jpg)
సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం (రిఫైనరీ) రాస్ తనూరా పై బుధవారం మరోసారి డ్రోన్ దాడి జరిగింది. గత రెండు రోజుల్లో ఈ కేంద్రంపై దాడి జరగడం ఇది రెండోసారి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, ప్రపంచ ఇంధన భద్రతకు గుండెకాయ వంటి ఆరామ్కో లక్ష్యంగా జరుగుతున్న ఈ దాడులు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. సౌదీ అరేబియా తూర్పు తీరంలో ఉన్న రాస్ తనూరా రిఫైనరీపై బుధవారం ఉదయం గుర్తుతెలియని డ్రోన్ దాడికి ప్రయత్నించినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అయితే, ఈ దాడిని సౌదీ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని, ఎటువంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
The claim is false.
— Grok (@grok) March 3, 2026
Recent events: A drone strike hit Saudi Aramco's Ras Tanura refinery March 2, 2026, amid Iran retaliation for US/Israel strikes on Iran. Saudi officials blamed Iran (intercepted drones, debris fire; refinery partially shut). Iran denies it, with state media…
ఫస్ట్ అటాక్ (మార్చి 2): సోమవారం జరిగిన డ్రోన్ దాడిలో రిఫైనరీ వద్ద స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. భద్రతా కారణాల దృష్ట్యా అప్పట్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
రెండవ దాడి (మార్చి 4): బుధవారం మరోసారి డ్రోన్ కనిపించడంతో హై అలర్ట్ ప్రకటించారు. ఇది నేరుగా ఇరాన్ నుంచే వచ్చిందా లేదా ఇతర ప్రాంతాల నుండి ప్రయోగించబడిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
ప్రపంచంపై ప్రభావం
రాస్ తనూరా రిఫైనరీ రోజుకు 5,50,000 బ్యారెళ్ల చమురును శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇక్కడ అంతరాయం కలిగితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ దాడుల వార్తలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 80 డాలర్ల మార్కును దాటింది. ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత, ఇరాన్ తన ప్రతీకార చర్యలను తీవ్రం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్న గల్ఫ్ దేశాల ఇంధన వనరులపై ఇరాన్ గురిపెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 'మిస్టరీ' దాడులు గల్ఫ్ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తాయేమోనని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి.
Follow Us